Airtel Wynk: డాల్బీ అట్మోస్‌తో జత కట్టిన వింక్ మ్యూజిక్.. మ్యూజిక్ లవర్స్‌కు పండగే..!
వినియోగదారులను ఆకట్టుకోవడానికి రీచార్జ్ ప్లాన్స్‌పై ఆ యాప్స్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నాయి. అలాగే కొత్తకొత్త ఆవిష్కరణలతో మ్యూజిక్ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. తాజాగా వింక్ మ్యూజిక్ వినియోగదారులకు డాల్బీ అట్మోస్ సాంకేతికతను పరిచయం చేయడానికి డాల్బీ లేబొరెటీస్‌తో చేతులు కలిపింది. అయితే వినియోగదారులు ఈ సాంకేతికతను అనుభవించడానికి ఎలాంటి అదను చార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
పెరిగిన స్మార్ట్‌ఫోన్ వినియోగం కారణంగా ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్ వివిధ యాప్స్ ద్వారా సంగీతాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. టెలికాం కంపెనీలు కూడా సంగీత ప్రియులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక యాప్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో జియోకు సంబంధించి సావన్ యాప్, అలాగే ఎయిర్‌టెల్ వింక్ మ్యూజిక్ యాప్ ఎక్కువ ప్రజాదరణ పొందాయి. అయితే వినియోగదారులను ఆకట్టుకోవడానికి రీచార్జ్ ప్లాన్స్‌పై ఆ యాప్స్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నాయి. అలాగే కొత్తకొత్త ఆవిష్కరణలతో మ్యూజిక్ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. తాజాగా వింక్ మ్యూజిక్ వినియోగదారులకు డాల్బీ అట్మోస్ సాంకేతికతను పరిచయం చేయడానికి డాల్బీ లేబొరెటీస్‌తో చేతులు కలిపింది. అయితే వినియోగదారులు ఈ సాంకేతికతను అనుభవించడానికి ఎలాంటి అదను చార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. వింక్ మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌కు డాల్బీ అట్మోస్ పరిచయం చేయడం ద్వారా వినియోగదారులకు లీనమయ్యే శ్రవణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ తాజా ఆవిష్కరణ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
వింక్ మ్యూజిక్ వినియోగదారులు ప్రస్తుతం ఎనిమిది వేర్వేరు భాషల్లో పాటలను డాల్బీ అట్మాస్ సాంకేతికతను వినియోగించి ఆశ్వాదించవచ్చు. వింక్ మ్యూజిక్ రాబోయే రోజుల్లో ఈ క్యాట్‌లాగ్‌ను నిరంతరం విస్తరింపజేస్తుంది. వినియోగదారులందరికీ అసాధారణమైన సంగీత ప్రయాణాన్ని ఉచితంగా అందిస్తుంది. ఈ తాజాగా ఆవిష్కరణపై ఎయిర్‌టెల్ డిజిటల్ ప్రతినిధులు మాట్లాడుతూ కస్టమర్లకు ఉత్తమమైన సంగీతాన్ని అందించడం ద్వారా వారిని సంతోషపెట్టడం మా ప్రధాన ప్రతిపాదనగా ఉంటుందని తెలిపారు. డాల్బీతో ఎయిర్‌టెల్ భాగస్వామ్యం ద్వారా మునుపెన్నడూ లేని ఆడియో అనుభవంతో విస్తృతమైన లైబ్రరీ, అత్యుత్తమ సంగీతాన్ని యూజర్లకు అందిస్తామని పేర్కొంటున్నారు. డాల్బీ అట్మాస్ కచ్చితంగా వినియోగదారుల అనుభవాన్ని అపరిమితంగా మెరుగుపరుస్తుందని వివరిస్తున్నారు. ఈ తాజా కలయికపై డాల్బీ అట్మోస్ ప్రతినిధులు మాట్లాడుతూ వింక్ మ్యూజిక్‌తో సహకరించడం అంటే విప్లవాత్మక సంగీత అనుభవాన్ని మరింత మంది సంగీత అభిమానులకు అందించడమేనని పేర్కొన్నారు. వినియోగదారుల సంగీత అనుభవాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లడంపై ఎంతో సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..