Wings Smartwatch: మార్కెట్‌లోకి నయా స్మార్ట్‌ వాచ్‌ రిలీజ్‌ చేసిన వింగ్స్‌.. సూపర్‌ ఫీచర్స్‌తో ప్లాటినం వాచ్‌ లాంచ్‌..

|

Sep 12, 2023 | 6:45 PM

ముఖ్యంగా రోజుకు ఎంత దూరం నడిచామో? స్టెప్‌ కౌంటింగ్‌ సదుపాయం కూడా ఉండడంతో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారు స్మార్ట్‌ వాచ్‌లను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు సరికొత్త ఫీచర్లతో ‍స్మార్ట్‌ వాచ్‌లను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా వింగ్స్‌ కంపెనీ ప్లాటినం పేరుతో నయా స్మార్ట్‌ వాచ్‌ను రిలీజ్‌ చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ వాచ్‌ స్పెసిఫికేషన్లతో పాటు ధర విషయాలను ఓ సారి తెలుసుకుందాం.

Wings Smartwatch: మార్కెట్‌లోకి నయా స్మార్ట్‌ వాచ్‌ రిలీజ్‌ చేసిన వింగ్స్‌.. సూపర్‌ ఫీచర్స్‌తో ప్లాటినం వాచ్‌ లాంచ్‌..
Wings Smart Watch
Follow us on

భారతదేశంలోని యువత ఇటీవల కాలంలో స్మార్ట్‌ యాక్ససరీస్‌ వాడకాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ వాచ్‌లను వాడకం బాగా పెరిగింది. గతంలో కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే వాడుకునే వాచ్‌లు ఇటీవల కాలంలో మరింత స్మార్ట్‌గా రావడం యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు ఈ వాచ్‌ల ద్వారా కాల్స్‌ మాట్లాడుకునే సదుపాయంతో పాటు ఆరోగ్య సంబంధిత హెచ్చరికలను కూడా పొందే అవకాశం ఉండడంతో మధ్య వయస్కులతో పాటు వృద్ధులు కూడా వీటిని విరివిగా వాడుతున్నారు. ముఖ్యంగా రోజుకు ఎంత దూరం నడిచామో? స్టెప్‌ కౌంటింగ్‌ సదుపాయం కూడా ఉండడంతో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారు స్మార్ట్‌ వాచ్‌లను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు సరికొత్త ఫీచర్లతో ‍స్మార్ట్‌ వాచ్‌లను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా వింగ్స్‌ కంపెనీ ప్లాటినం పేరుతో నయా స్మార్ట్‌ వాచ్‌ను రిలీజ్‌ చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ వాచ్‌ స్పెసిఫికేషన్లతో పాటు ధర విషయాలను ఓ సారి తెలుసుకుందాం.

హోమ్‌గ్రోన్ వేరబుల్స్ బ్రాండ్ వింగ్స్ తన సరికొత్త స్మార్ట్‌వాచ్ వింగ్స్ ప్లాటినమ్‌ను ఇటీవల రిలీజ్‌ చేసింది. రూ.1999 ధరతో రిలీజ్‌ చేసిన ఈ వాచ్‌పై ప్రారంభ ఆఫర్‌ కింద రూ.1499కే అందుబాటుఓ ఉంటుంది. ఈ సరికొత్త వింగ్స్ ప్లాటినం స్మార్ట్‌వాచ్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, బ్రాండ్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. వింగ్స్ ప్లాటినం స్మార్ట్‌వాచ్ 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్‌తో పాటు రౌండ్ డయల్ ఆకారంతో 1.39 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ వాచ్‌ 110 వర్కౌట్ మోడ్‌లతో పాటు 200 అనుకూలీకరించదగిన వాచ్ ఫేస్‌లతో కూడా వస్తుంది. ఈ కొత్త వింగ్స్ స్మార్ట్‌వాచ్ 260 ఎంఏహెచ్‌ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

ఈ వాచ్ ఏడు రోజుల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ వాచ్‌లో ముఖ్యంగా కనెక్టివిటీ, కాలింగ్ కోసం బ్లూటూత్ వెర్షన్ 5.3తో ఆకర్షణీయంగా ఉంటుది. అలాగే ఇది హృదయ స్పందన రేటుతో పాటు ఎస్‌పీఓ 2ను ఆరోగ్య పర్యవేక్షణ సెన్సార్‌లు ఈ వాచ్‌ ప్రత్యేకతలుగా ఉంటాయి. ఈ స్మార్ట్‌వాచ్ లైనప్‌లో మా రౌండ్ డయల్ డిస్‌ప్లేలలో వింగ్స్ ప్లాటినం మొదటిదని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. విస్తారమైన ప్రాధాన్యతలు, పరిపక్వ రూపాన్ని ఇష్టపడే వ్యక్తులు, అవసరమైన వ్యక్తులకు అందించడం మా లక్ష్యమని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి