Boat Smart Watch: యాపిల్ వాచ్ డిజైన్‌తో బోట్ నుంచి సూపర్ స్మార్ట్ వాచ్.. ధరెంతో తెలిస్తే షాకవుతారు..
బోట్ వేవ్ ఎలివేట్ స్మార్ట్‌వాచ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్ ఆపిల్ వాచ్ అల్ట్రాను పోలి ఉండే డిజైన్‌తో ఆవిష్కరించారు. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అలాగే ఈ వాచ్‌లో 20 కాంటాక్ట్‌లను సేవ్ చేసుకోచ్చు. స్మార్ట్ వాచ్‌లో డయల్‌ప్యాడ్‌తో పాటు అంతర్నిర్మిత స్పీకర్‌తో పాటు మైక్ కూడా ఉన్నాయి.
స్మార్ట్ వాచ్‌లు, ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇలా ఎన్ని కంపెనీలు వచ్చినా యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు ఉండే క్రేజ్ వేరు. అందువల్ల మార్కెట్‌లో యాపిల్ కాపీ ప్రొడెక్ట్స చాలా వస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు యాపిల్ డిజైన్‌తో తమ ఉత్పత్తులను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ యాక్ససరీస్ సంస్థ అయిన బోట్ యాపిల్ వాచ్ డిజైన్‌తో కొత్త స్మార్ట్ వాచ్ రిలీజ్ చేసింది. బోట్ వేవ్ ఎలివేట్ స్మార్ట్‌వాచ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్ ఆపిల్ వాచ్ అల్ట్రాను పోలి ఉండే డిజైన్‌తో ఆవిష్కరించారు. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అలాగే ఈ వాచ్‌లో 20 కాంటాక్ట్‌లను సేవ్ చేసుకోచ్చు. స్మార్ట్ వాచ్‌లో డయల్‌ప్యాడ్‌తో పాటు అంతర్నిర్మిత స్పీకర్‌తో పాటు మైక్ కూడా ఉన్నాయి. ఇది 50కి పైగా క్రీడల కోసం ట్రాకింగ్‌ను అందిస్తుంది. ఇది ఆపిల్ వాచ్ అల్ట్రా లాంటి స్ట్రిప్‌తో వస్తుంది. ఈ తాజా స్మార్ట్ వాచ్‌లో మరిన్ని ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
బోట్ వేవ్ ఎలివేట్ ధర, లభ్యత
భారతదేశంలో బోట్ వేవ్ ఎలివేట్ స్మార్ట్ వాచ్ ధర రూ.2299గా నిర్ణయించారు. ఇది కేవలం పరిచయ ధర అని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ స్మార్ట్ వాచ్ రిటైల్ ధరను ఇంకా వెల్లడించలేదు. ఇది గ్రే, బ్లాక్, గ్రీన్, ఆరెంజ్ అనే నాలుగు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ వాచ్‌ను బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అమెజాన్‌లో కొనుగోలు అందుబాటులో ఉంటుంది.
బోట్ వేవ్ ఎలివేట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
బోట్ వేవ్ ఎలివేట్ స్మార్ట్‌వాచ్ 1.96 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేతో పని చేస్తుంది. ఈ వాచ్ 500 నిట్‌ల వరకు ప్రకాశాన్ని అందిస్తుంది. ఈ వాచ్ చదరపు ఆకారంలో ఉన్న డయల్‌తో వస్తుంది. ఇది బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతు ఇస్తుంది. వినియోగదారులు వాచ్ నుంచి నేరుగా ఫోన్ కాల్‌లు చేయడానికి మరియు స్వీకరించడానికి అనుమతిస్తుంది. వాచ్‌లో డయల్‌ప్యాడ్‌తో పాటు ఇన్‌బిల్ట్ మైక్, స్పీకర్ కూడా ఉన్నాయి. ఇది వాచ్‌లో 20 కాంటాక్ట్‌లను సేవ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.
ఈ స్మార్ట్ వాచ్ ఎస్‌పీఓ2 పర్యవేక్షణ, హృదయ స్పందన సెన్సార్లు, నిద్ర పర్యవేక్షణ వంటి ఆరోగ్య-ట్రాకింగ్ లక్షణాలను కూడా అందిస్తుంది. బోట్ వేవ్ ఎలివేట్ రోజువారీ యాక్టివిటీ ట్రాకర్, సెడెంటరీ రిమైండర్‌లతో పాటు 50కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ దుమ్ము, నీటి నిరోధకత కోసం ఐపీ 67 రేటింగ్‌తో పని చేస్తుంది. బోట్ వేవ్ ఎలివేట్ స్మార్ట్‌వాచ్ ఐదు రోజుల వరకు పని చేస్తుంది. బ్లూటూత్ కాలింగ్‌తో పని చేస్తే రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ ప్రతినిధుల పేర్కొంటున్నారు. ఈ వాచ్ ముఖ్యంగా స్టాండ్‌బై మోడ్‌లో 15 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ వాచ్ ఎస్‌ఎంఎస్, సోషల్ మీడియా నోటిఫికేషన్ చాలా సింపుల్‌గా ఈ వాచ్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..