Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boat Wave Fury: యాపిల్‌ వాచ్‌ డిజైన్‌తో బోట్‌ నుంచి సరికొత్త స్మార్ట్‌ వాచ్‌.. తక్కువ ధరలో ఆకట్టుకుంటున్న ప్రీమియం ఫీచర్లు

ప్రముఖ స్మార్ట్‌ వాచ్‌ తయారీ సంస్థ బోట్‌ వచ్చి చేరింది. యాపిల్‌ వాచ్‌ డిజైన్‌తో సరికొత్త స్మార్ట్‌ వాచ్‌ రిలీజ్‌ చేసింది. బోట్‌ వేవ్‌ ఫ్యూరీ పేరుతో రిలీజ్‌ చేసిన ఈ స్మార్ట్‌వాచ్‌ యువతను ఆకట్టుకునే విధంగా ఉంది. కాబట్టి ఈ వాచ్‌ ధర, ఇతర ఫీచర్లపై ఓ సారి తెలుసుకుందాం.

Boat Wave Fury: యాపిల్‌ వాచ్‌ డిజైన్‌తో బోట్‌ నుంచి సరికొత్త స్మార్ట్‌ వాచ్‌.. తక్కువ ధరలో ఆకట్టుకుంటున్న ప్రీమియం ఫీచర్లు
Boat Wave Fury
Follow us
Srinu

|

Updated on: Jul 08, 2023 | 6:30 PM

భారతదేశంలో స్మార్ట్‌వాచ్‌ల వినియోగం విపరీతంగా పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు సరికొత్త మోడల్స్‌లో స్మార్ట్‌వాచ్‌లు రిలీజ్‌ చేస్తున్నాయి. అయితే స్మార్ట్‌వాచ్‌లు ఎక్కువగా యువత వాడుతున్నారు. సంప్రదాయిక వాచ్‌లకు భిన్నంగా వస్తున్న ఈ స్మార్ట్‌వాచ్‌లు అనేక ఫీచర్లతో వస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన హెచ్చరికలతో వస్తుండడంతో మధ్య వయస్సున్న వారు కూడా స్మా‍ర్ట్‌వాచ్‌లంటే మక్కువ చూపుతున్నారు. టెక్నాలజీ విషయం దగ్గరకు వచ్చేసరికి స్మార్ట్‌ఫోన్లు, వాచ్‌లు, ల్యాప్‌టాప్‌ ఇలా అన్ని ఉపకరణాల్లో యాపిల్‌ ప్రొడెక్ట్స్‌ ముందంజలో ఉంటాయి. అయితే యాపిల్‌ ఉపకరణాల ధరలు మాత్రం సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండవు. భారతదేశంలో అంటే ఎక్కువగా మధ్యతరగతి ప్రజలు ఉంటారు. దీంతో వీరిని ఆకట్టుకునేలా కంపెనీలు యాపిల్‌ ప్రొడెక్ట్స్‌ డిజైన్‌తో ఉపకరణాలు అందుబాటులో ఉంచడం పరిపాటి. ఇదే కోవలోకి ప్రముఖ స్మార్ట్‌ వాచ్‌ తయారీ సంస్థ బోట్‌ వచ్చి చేరింది. యాపిల్‌ వాచ్‌ డిజైన్‌తో సరికొత్త స్మార్ట్‌ వాచ్‌ రిలీజ్‌ చేసింది. బోట్‌ వేవ్‌ ఫ్యూరీ పేరుతో రిలీజ్‌ చేసిన ఈ స్మార్ట్‌వాచ్‌ యువతను ఆకట్టుకునే విధంగా ఉంది. కాబట్టి ఈ వాచ్‌ ధర, ఇతర ఫీచర్లపై ఓ సారి తెలుసుకుందాం.

బోట్ వేవ్ ఫ్యూరీని రెండు వేరియంట్లలో పరిచయం చేసింది. సిలికాన్ స్ట్రాప్, యాక్టివ్ బ్లాక్, సియాన్ బ్లూ, చెర్రీ బ్లోసమ్, టీల్ గ్రీన్ వంటి కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. మరోవైపు మెటాలిక్ స్ట్రాప్ వేరియంట్ కూడా యువతను ఆకట్టుకునేలా రిలీజ్‌ చేశారు. ఈ కొత్త స్మార్ట్ వాచ్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు బోట్‌  అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 1,299 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ నయా స్మార్ట్‌ వాచ్‌ విక్రయం జూలై 9 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఫీచర్ల విషయానికి వస్తే ఈ స్మార్ట్ వాచ్ యాపిల్ వాచ్ లాగా కనిపించే స్క్వేర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ఈ వాచ్‌ 240 x 284 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 550 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని అందించే 1.83 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ కొత్త స్మార్ట్‌వాచ్ 50కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు అందుబాటులో ఉంటాయి. అలాగే హృదయ స్పందన ట్రాకింగ్, ఎస్‌పీఓ 2, బ్లడ్ ఆక్సిజన్ మ్యాపింగ్ వంటి అనేక ఆరోగ్య సంబంధిత సెన్సార్‌లతో వస్తుంది. ఈ వాచ్‌ బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. అలాగే అధిక నాణ్యతతో వచ్చే మైక్రోఫోన్, డయల్ ప్యాడ్ ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ వాచ్‌లో 10 కాంటాక్ట్‌లను సేవ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఐపీ 67 సపోర్ట్‌తో దుమ్ము, నీటి నిరోధకతతో వస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ వాచ్‌ ఐదు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ ఇస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నారు. ఈ బోట్ వేవ్ ఫ్యూరీ స్మార్ట్ వాచ్‌లో యూజర్లు మ్యూజిక్ కంట్రోల్, కెమెరా కంట్రోల్ వంటి ఇతర ఫీచర్లను కూడా పొందుతారని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..