iQOO Neo 7 Pro: మంచి గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇదే బెస్ట్.. కళ్లముందు మేజిక్ చేసే గ్రాఫిక్స్..
ఐక్యూఓఓ(iQOO) నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ మన దేశ మార్కెట్లో విడుదలైంది. దాని పేరు ఐక్యూఓఓ నియో 7 ప్రో. ఇంతకు ముందుకు ఉన్న ఐక్యూఓఓ నియో 7 ఫోన్ డివైజ్ ను అప్ గ్రేడ్ చేసి, కొన్ని ఫీచర్లను యాడ్ చేసి ఐక్యూఓఓ నియో 7ప్రోను ఆవిష్కరించారు. దీనిలో ఇండిపెండెంట్ గేమింగ్ చిప్(ఐజీ చిప్) ఉంటుంది.
మార్కెట్లో కొత్త కొత్త టెక్ కంపెనీలు దూసుకొస్తున్నాయి. వాటిల్లో అంతర్జాతీయ బ్రాండ్లు, పలు స్టార్ట్ అప్ కంపెనీలు కూడా ఉంటున్నాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ తో ఆకట్టుకుంటున్నాయి. ఇదే క్రమలో ఐక్యూఓఓ(iQOO) నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ మన దేశ మార్కెట్లో విడుదలైంది. దాని పేరు ఐక్యూఓఓ నియో 7 ప్రో. ఇంతకు ముందుకు ఉన్న ఐక్యూఓఓ నియో 7 ఫోన్ డివైజ్ ను అప్ గ్రేడ్ చేసి, కొన్ని ఫీచర్లను యాడ్ చేసి ఐక్యూఓఓ నియో 7ప్రోను ఆవిష్కరించారు. దీనిలో ఇండిపెండెంట్ గేమింగ్ చిప్(ఐజీ చిప్) ఉంటుంది. అధిక పనితీరును అందిస్తోంది.
ఐక్యూఓఓ నియో 7 ప్రో స్పెసిఫికేషన్లు..
ఐక్యూఓఓ నియో 7 ప్రోలో 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ స్క్రీన్ ఉంటుంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్ సెట్ ఉంటుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. గేమింగ్ కోసం అయితే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఆండ్రాయిడ్ 13 ఫన్ టచ్ ఓఎస్ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ కంపెనీ మూడేళ్ల పాటు నెల వారీ సెక్యూరిటీ, రెండేళ్ల పాటు అప్ డేట్లను అందిస్తుంది.
ఐక్యూఓఓ నియో 7 ప్రో కెమెరా..
ఈ ఫోన్ లో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరా ఉంటుంది. ఫోన్ ముందు వైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ కు మద్ధతు ఇస్తుంది.
ఐక్యూఓఓ నియో 7 ప్రో ధర, లభ్యత..
ఐక్యూ ఓఓ నియో 7 ప్రో 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమరీ ధర రూ. 34,999గా ఉంది. అలాగే 12జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 37,999గా ఉంది. ఇది ఫియర్ లెస్ ఫ్లేమ్, డార్క్ స్టోర్మ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీనిని మీరు అమెజాన్ సైట్లో ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ జూలై 15 నుంచి ఐక్యూఓఓ ఈ స్టోర్ తో పాటు అమెజాన్ సైట్లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. దీనిని ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వారికి రెండేళ్ల పాటు ఉచిత వారంటీని కంపెనీని అందిస్తోంది.
ఈ సందర్భంగా ఐక్యూఓఓ సీఈఓ నిపున్ మౌర్య మాట్లాడుతూ ఈ ఐక్యూఓఓ నియో 7 ప్రో లో కొత్త గేమింగ్ చిప్ ఉంచామన్నారు. దీని వల్ల గేమ్ ఫ్రేమ్ ఇంటర్ పోiలేషన్, మరింత క్లారిటీతో కూడిన డిస్ ప్లేతో పాటు మోషన్ కంట్రోల్ ఫీచర్ ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..