Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boat Kids Smart Watch: పిల్లల కోసం బోట్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్.. ధరెంతో తెలిస్తే షాకవుతారు..

ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ అయిన బోట్ ఇప్పుడు పిల్లలను కూడా ఆకట్టుకోవడానికి సరికొత్త కిడ్స్ స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేసింది. వాండరర్ స్మార్ట్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్‌లో పిల్లలను ఆకట్టుకునేలా ఎన్నో ఫీచర్లను పెట్టింది. బోట్ వాండరర్ స్మార్ట్‌ను ప్రారంభించడంతో బోట్ దాని స్మార్ట్‌వాచ్ లైనప్‌ను మరింత విస్తరించింది.

Boat Kids Smart Watch: పిల్లల కోసం బోట్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్.. ధరెంతో తెలిస్తే షాకవుతారు..
Boat
Follow us
Srinu

|

Updated on: May 21, 2023 | 8:30 PM

ప్రస్తుతం భారతదేశంలో స్మార్ట్ యాక్ససరీస్ ట్రెండ్ నడుస్తుంది. చాలా మంది యువత స్మార్ట్ ఫోన్లు వాడడంతో వాటికి కనెక్ట్ అయ్యేలా స్మార్ట్ యాక్ససరీస్ వాడడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఈ కోవలో స్మార్ట్ వాచ్‌లను ఎక్కువ ఇష్టపడుతున్నారు. దీంతో కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు కొత్త మోడల్ స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. అయితే ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ అయిన బోట్ ఇప్పుడు పిల్లలను కూడా ఆకట్టుకోవడానికి సరికొత్త కిడ్స్ స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేసింది. వాండరర్ స్మార్ట్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్‌లో పిల్లలను ఆకట్టుకునేలా ఎన్నో ఫీచర్లను పెట్టింది. బోట్ వాండరర్ స్మార్ట్‌ను ప్రారంభించడంతో బోట్ దాని స్మార్ట్‌వాచ్ లైనప్‌ను మరింత విస్తరించింది. స్మార్ట్‌వాచ్‌లో ఇన్‌బిల్ట్ జీపీఎస్‌తో పాటు ఇన్‌బిల్ట్ 4జీ సిమ్ కనెక్టివిటీతో వస్తుంది. దీనితో పాటు ఈ స్మార్ట్ వాచ్ చైల్డ్ కనెక్ట్, సేఫ్టీ ఫీచర్లతో కూడా వస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ వెబ్‌సైట్‌తో పాటు, బోట్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలుకు చేయడానికి రెడీగా ఉంది. అలాగే ఈ వాచ్ ధరను కంపెనీ రూ.5000గా నిర్ణయించింది. బోట్ వాండరర్ స్మార్ట్ వాచ్ ద్వారా వచ్చే అధునాతన ఫీచర్లు ఏంటో ఓసారి తెలుసుకుందాం.

బోట్ వాండరర్ స్మార్ట్ కిడ్స్ స్మార్ట్‌వాచ్ జియో–ఫెన్సింగ్ మరియు ఇన్-బిల్ట్ జీపీఎస్‌తో వస్తుంది. ఇది తల్లిదండ్రులు తమ పిల్లల ఆచూకీని ట్రాక్ చేయడానికి అనువుగా ఉంటుంది. అలాగే ఈ వాచ్ ద్వారా జియోఫెన్సింగ్ రేడియస్‌ను కూడా సృష్టించవచ్చు. మీ చిన్నారి తమ సేఫ్టీ జోన్‌ను విడిచిపెట్టి తిరిగి వచ్చిన ప్రతిసారీ రియల్ టైమ్ ద్వారా వెంటనే తెలుసుకోవచ్చు.  1.4 అంగుళా హెచ్‌డీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేతో వచ్చే ఈ వాచ్ డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగా ఈ వాచ్ అంతర్నిర్మిత 4 జీ కనెక్టివిటీతో వస్తుంది. అలాగే 4జీ సిమ్ సహాయంతో మీరు స్క్రీన్‌పై ఒక్కసారి నొక్కడం ద్వారా మెసేజ్‌లు, వాయిస్ కాల్స్ ఇలా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో స్పందించేలా ఎస్ఓఎస్  బటన్ ఉంది. దీని సహాయంతో మీ పిల్లలు ఆపదలో ఉంటే వెంటనే తెలుసుకోవచ్చారు. బోట్ వాండరర్ స్మార్ట్ కిడ్స్ స్మార్ట్‌వాచ్ స్టెప్స్ ట్రాకర్‌ను కూడా కలిగి ఉంది. ఇది మీ పిల్లల ఆరోగ్యం, కార్యాచరణను ఇంటరాక్టివ్ స్టెప్ ట్రాకింగ్‌తో పర్యవేక్షిస్తుంది.మీ పిల్లలు తమ రోజును సకాలంలో ప్రారంభించడంలో సహాయపడటానికి అలారంతో పాటు స్టాప్‌వాచ్ ఉన్నాయి.  ఈ స్మార్ట్‌వాచ్ ఐపీ 68 రేటింగ్‌తో వస్తుంది. ఇది నీటి-నిరోధకతను కలిగిస్తుంది. అలాగే ఇందులో ఉన్న బ్యాటరీ రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..