KeyBoard Shortcuts: బ్రౌజింగ్ హిస్టరీ క్లియర్ చేయడం ఇబ్బందిగా ఉందా? ఈ షార్ట్‌కట్‌తో చాలా ఈజీ..
రోజుల తరబడి పని చేయడం వల్ల కచ్చితం ఆయా సిస్టమ్స్ స్లో అవుతాయి. దీంతో కచ్చితంగా మీరు మీ బ్రౌజింగ్ హిస్టరీని రీసెట్ చేయాల్సి వస్తుంది.అంతేకాదు మీ కాష్‌ని క్లియర్ చేయాలన్నా, వెబ్‌సైట్ కుక్కీలను తొలగించాలనుకున్నా కొంచెంద తడబాటుగా ఉంటుంది. అయితే ఎలా క్లియర్ చేయాలో? అని కచ్చితంగా యూట్యాబ్‌లో చెక్ చేస్తూ ఉంటాం.
కరోనా మహమ్మారి తర్వాత వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ బాగా పెరిగింది. కచ్చితంగా ప్రతి ఒక్కరికీ కంప్యూటర్ కానీ, ల్యాప్ టాప్ కానీ కచ్చితంగా ఉంటుంది. అయితే రోజుల తరబడి పని చేయడం వల్ల కచ్చితం ఆయా సిస్టమ్స్ స్లో అవుతాయి. దీంతో కచ్చితంగా మీరు మీ బ్రౌజింగ్ హిస్టరీని రీసెట్ చేయాల్సి వస్తుంది.అంతేకాదు మీ కాష్‌ని క్లియర్ చేయాలన్నా, వెబ్‌సైట్ కుక్కీలను తొలగించాలనుకున్నా కొంచెంద తడబాటుగా ఉంటుంది. అయితే ఎలా క్లియర్ చేయాలో? అని కచ్చితంగా యూట్యాబ్‌లో చెక్ చేస్తూ ఉంటాం. అయితే కొన్ని కీ బోర్డ్ షార్ట్ కట్స్‌తో చాలా ఈజీగా బ్రౌజర్ హిస్టరీతో పాటు కాష్‌ను, కుకీలను క్లియర్ చేయవచ్చు. ఇక్కడ తెలిపే ఈ కీబోర్డ్ షార్ట్‌కట్ విండోస్ పీసీతో పాటు మ్యాక్‌లో కూడా పని చేస్తుంది. ఇది ఏ ప్లాట్‌ఫారమ్‌లో అయినా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. కానీ మార్పులు తక్కువగా ఉంటాయి. అలాగే గూగుల్ క్రోమ్‌తో పాటు మొజిల్లా ఫైర్‌ఫాక్స్, యాపిల్ సఫారి, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో చాలా బాగా పని చేస్తుంది. కాబట్టి బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసే ఆ షార్ట్ కట్ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
- మీ బ్రౌజర్ తెరిచినప్పుడు విండోస్‌లో కంట్రోల్+షిఫ్ట్+డిలీట్ బటన్స్ కలిపి నొక్కాలి. అయితే మ్యాక్‌లో అయితే కమాండ్+షిఫ్ట్+డిలీట్ అనే బటన్స్ నొక్కాలి. ఇది మీ బ్రౌజింగ్ డేటా లేదా ఇటీవలి చరిత్రను క్లియర్ చేయడానికి విండోను తెరుస్తుంది.
- మీరు క్లియర్ చేయాలనుకుంటున్న సమయ పరిధి, డేటా రకాన్ని ఎంచుకోవాలి.
- అయితే మీరు దీన్ని ఒకసారి మాత్రమే కాన్ఫిగర్ చేయాలి. మీరు ఇక్కడ ఎంచుకున్న సెట్టింగ్‌లు భవిష్యత్ ఉపయోగం కోసం సేవ్ అవుతాయని గుర్తుంచుకోవాలి.
- తర్వాత మీ బ్రౌజింగ్ చరిత్రను క్లియర్ చేయడానికి బటన్‌ను క్లిక్ చేస్తే సరి మీ బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం డిలీట్ అవుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి