New Feature In IPhone: మీ మాటే మిమ్మల్ని గైడ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఐ ఫోన్ రిలీజ్ చేస్తున్న ఫీచర్ తెలిస్తే షాకవుతారు
ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ గణనీయంగా పెరగడంతో యాపిల్ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో కస్టమర్ల ముందుకు వస్తుంది. తాజాగా వస్తున్న ఐఓఎస్ 17లో వ్యక్తిగత వాయిస్ క్లోనింగ్ చేసే అవకాశం కల్పిస్తుంది. కేవలం 15 నిమిషాల్లోనే వాయిస్ క్లోనింగ్‌కు అవకాశం ఇస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ప్రపంచంలో ఏ కంపెనీ అయినా ఫీచర్స్ విషయంలో యాపిల్‌ను ఫాలో అవ్వాల్సిందే. ముఖ్యంగా తన ఐఓఎస్ సిస్టమ్ ద్వారా సెక్యూరిటీ ఫీచర్లు ఇవ్వడంతో ఐఫోన్‌ను ఇష్టపడేవారు విపరీతంగా పెరిగారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ గణనీయంగా పెరగడంతో యాపిల్ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో కస్టమర్ల ముందుకు వస్తుంది. తాజాగా వస్తున్న ఐఓఎస్ 17లో వ్యక్తిగత వాయిస్ క్లోనింగ్ చేసే అవకాశం కల్పిస్తుంది. కేవలం 15 నిమిషాల్లోనే వాయిస్ క్లోనింగ్‌కు అవకాశం ఇస్తుంది. ఈ కొత్త యాక్ససబిలిటీ ఫీచర్ దివ్యాంగులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మెషీన్ లెర్నింగ్ ఆధారిత ఫీచర్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఫీచర్ మీ ఐఫోన్ మీ సొంత వాయిస్‌తో మాట్లాడే అవకాశం ఇస్తుంది. ఈ ఫీచర్ ప్రసంగంలో వైకల్యం ఉన్నవారు ఎక్కువ సేపు మాట్లాడకుండా ఆపే అవకాశం ఉన్నవారికి ఈ ఫీచర్ చాలా బాగా పని చేస్తుంది. యాపిల్ అందించే ఈ కొత్త ఫీచర్ గురించి ఓ సారి తెలుసుకుందాం.
మాట్లాడానికి ఇబ్బందిపడేవారికి ఈ ఫీచర్ చాలా బాగా పని చేస్తుందని యాపిల్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ (ఏఎల్ఎస్) రోగ నిర్ధారణ, మాట్లాడే సామర్థ్యం క్రమక్రమంగా ప్రభావితం చేసే వారికి ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ కంపెనీ నూతనంగా లాంచ్ చేసే లైవ్ వాయిస్‌తో సజావుగా అనుసంధానించుకోవచ్చు. ఓ రకంగా చెప్పాలంటే ఇది టెక్ట్స్ టు స్పీచ్ సిస్టమ్. అయితే ఇక్కడ మన వాయిస్‌తో ఆ స్పీచ్ రావడం అనేది ప్రత్యేకత. అలాగే యాపిల్ వినియోగదారులు కేవలం 15 నిమిషాల్లో ఆడియో నిర్ధారించడానికి టెక్ట్స్ ప్రాంప్టలను చదవాల్సి ఉంటుంది. ఇది పూర్తయ్యాక ఫోన్‌లో ఉండే మెషీన్ లెర్నింగ్ టూల్ మీ వాయిస్‌ను క్లోన్ చేస్తాయి. లైవ్ స్పీచ్‌ను ఉపయోగించే వినియోగదారులు అసహజంగా అనిపించే రోబోటిక్ డిఫాల్ట్ వాయిస్‌కు బదులుగా తమ సొంత వాయిస్‌ను వినియోగించవచ్చు. అయితే ప్రస్తుతం ఈ సాంకేతికత ప్రయోగదశలో ఉంది. ఇందులో విజయవంతమైతే త్వరలోనే మనం వాయిస్‌ను సృష్టించవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..