Huawei watch GT 4 Series: హుషారెత్తించే న్యూస్.. హువావే నుంచి సరికొత్త స్మార్ట్ వాచ్‌లు.. గ్రాండ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్..
హువావే కంపెనీ బార్సిలోనాలో ఈ నెల 14న నిర్వహించే ఈవెంట్లో హువావే వాచ్ జీటీ 4 సిరీస్ వాచ్ లను ఆవిష్కరించనుంది. కంపెనీ ఈ విషయాన్ని సూచనప్రాయంగా తెలిపింది. అసలు విషయాన్ని వెల్లడించకుండా నర్మగర్భంగా వెల్లడించింది. హువావే ట్విట్టర్ ఖాతాలో ‘వేరబుల్ స్ట్రెటజీ అండ్ న్యూ ప్రాడక్ట్ లాంచ్ ’ అని కోట్ చేస్తూ ఓ పోస్టు పెట్టింది. పైగా వాచ్ డైల్ ను ఈ కోటేషన్ కు జోడించి పోస్టర్ ను విడుదల చేసింది.

ప్రస్తుత మార్కెట్లో ఏదైనా ట్రెండీ ఐటెం ఉందీ అంటే అది స్మార్ట్ వాచ్ అనే చెప్పాలి. ఎన్ని రకాల ఎలక్ట్రానిక గ్యాడ్జెట్లు మనకు కనిపిస్తున్నా అందరూ వినియోగించేది కొన్ని మాత్రమే. వాటికే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. అలా డిమాండ్ ఉన్న వాటిల్లో మొదటి స్థానంలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ తమ చేతిలో ఉండాలనుకొంటున్నారు. దీన తర్వాత స్థానం స్మార్ట్ వాచే. ప్రతి ఒక్కరి మణికట్టుకు ఈ స్మార్ట్ వాచ్ ఉండేలా చూసుకొంటున్నారు. ఈ స్మార్ట్ వాచ్ లో ఉంటున్న అత్యాధునిక ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీలు పెద్ద ఎత్తున స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం హువావే నుంచి వాచ్ జీటీ 4 సిరీస్ స్మార్ట్ వాచ్ లను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
లాంచింగ్ అప్పుడే..
హువావే కంపెనీ బార్సిలోనాలో ఈ నెల 14న నిర్వహించే ఈవెంట్లో హువావే వాచ్ జీటీ 4 సిరీస్ వాచ్ లను ఆవిష్కరించనుంది. కంపెనీ ఈ విషయాన్ని సూచనప్రాయంగా తెలిపింది. అసలు విషయాన్ని వెల్లడించకుండా నర్మగర్భంగా వెల్లడించింది. హువావే ట్విట్టర్ ఖాతాలో ‘వేరబుల్ స్ట్రెటజీ అండ్ న్యూ ప్రాడక్ట్ లాంచ్ ’ అని కోట్ చేస్తూ ఓ పోస్టు పెట్టింది. పైగా వాచ్ డైల్ ను ఈ కోటేషన్ కు జోడించి పోస్టర్ ను విడుదల చేసింది. దీంతో మెగా ఈవెంట్లో లాంచ్ అయ్యేది స్మార్ట్ వాచేనని హింట్ ఇచ్చింది. దీనిపై టిప్ స్టర్ సైట్ స్పందిస్తూ హువావే వాచ్ జీటీ 4 సిరీస్ నే వచ్చే ఈవెంట్లో గ్రాండ్ లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. యాపిల్ వండర్ లస్ట్ ఈవెంట్ ముగిసిన రెండు రోజుల తర్వాత హువావే ఈ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ లో కనిపిస్తున్న పోస్టర్ ఆధారంగా ఇది కచ్చితంగా జీటీ 4 సిరీస్ వాచ్ లే అన్న అంచనాకు మార్కెట్ వర్గాలు వచ్చాయి. కాగా ఈ హువావే వాచ్ జీటీ 4 సిరీస్ వాచ్ లకు సంబంధించిన ఎటువంటి వివరాలు సంస్థ వెల్లడించలేదు. దీని గురించి పూర్తి వివరాలు లాంచ్ రోజునే వెల్లడయ్యే అవకాశం ఉంది.




Get ready to be entranced by the extraordinary – an exhilarating journey of exploration. Stay tuned, as the mysteries unfold on September 14, 2023.#HuaweiHealth #FashionForward#ComingSoon pic.twitter.com/u84oRqC0uf
— Huawei Mobile (@HuaweiMobile) September 4, 2023
ఈ మోడళ్లు ప్రత్యక్షం..
అయితే హువావే సెంట్రల్ గత ఆగస్టులో చెప్పిన దాని ప్రకారం హువావే వాచ్ జీటీ 4 సిరీస్ బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ సైట్లో ప్రత్యక్షమైంది. నాలుగు రకాల మోడల్ నంబర్లతో ఈ వాచ్ లు కనిపించాయి. హువావే వాచ్ జీటీ 4(పీఎన్ఎక్స్-బీ19), హువావే వాచ్ హెచ్5546(పీఎన్ఎక్స్-బీ19బీ), హువావే క్విక్ గ్యూన్ హెచ్5546(పీఎన్ఎక్స్-బీ19బీ), హువావే వాచ్ జీటీ4(ఏఆర్-బీ19) పేరిట అవి ఉన్నాయి. ఆ రిపోర్టును బట్టి ఈ స్మార్ట్ వాచ్ లు హార్మోనీస్ ఓఎస్ 4 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆధారంగా పనిచేస్తాయి. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.2 కనెక్టవిటీతో వస్తాయి.
కాగా హువావే వాచ్ జీటీ 3 బేస్ వేరియంట్ 2021 అక్టోబర్ లాంచ్ అయ్యింది. దీని ప్రో వేరియంట్ 2022 ఏప్రిల్ లో మార్కెట్లోకి వచ్చింది. ఈ వాచ్ జీటీ 3 అది 32ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్ తో వస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..