- Telugu News Photo Gallery Technology photos Realme launched Realme narzo 60x smart phone check here for features and price details
Realme Narzo 60x: రియల్‌మీ నుంచి బడ్జెట్ 5జీ ఫోన్.. 50 ఎంపీ కెమెరాతోపాటు మరెన్నో స్టన్నింగ్ ఫీచర్స్
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ రియల్ మీ భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ నార్జో 60 ఎక్స్ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చారు. రెండు వేరియంట్స్‌లో ఈ 5జీ ఫోన్‌ను లాంచ్ చేశారు. రియల్‌మీ నార్జో 60 ఎక్స్ స్మార్ట్ ఫోన్ తొలి సేల్ సెప్టెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Sep 07, 2023 | 3:10 PM

రియల్‌మీ నార్జో 60 ఎక్స్ మొత్తం రెండు వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999 కాగా, 6జీబీ ర్యామ్128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా ఉంది. నెబ్యులా పర్పుల్, స్టెల్లార్ గ్రీన్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, 680 nits బ్రైట్‌నెస్ ఈ డిస్‌ప్లే సొంతం. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు సైడ్‌కు అందించారు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.

రియల్‌మీ నార్జో 60 ఎక్స్ స్మార్ట్ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.




