- Telugu News Photo Gallery Technology photos Infinix launches new smartphone Infinix zero 30 features and price details Telugu Tech News
Infinix Zero 30: 108 ఎంపీ కెమెరాతో ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్.. ధర కూడా తక్కువేనండోయ్
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ ఇన్‌ఫినిక్స్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇన్‌ఫినిక్స్ జీరో 30 5జీ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్స్ ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి ప్రీ ఆర్డర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్‌లోనే మంచి ఫీచర్స్‌తో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
Updated on: Sep 07, 2023 | 4:33 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఇన్‌ఫినిక్స్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇన్‌ఫినిక్స్ జీరో 30 పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన తొలి సేల్ సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

రెండు వేరియంట్స్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,999 కాగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది. లాంచింగ్ ఆఫర్ కింద పలు బ్యాంక్‌ల కార్డులపై డిస్కౌంట్ అందించనున్నారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 2,400x1,080 పిక్సెల్‌తో కూడిన కర్వ్డ్ డిస్‌ప్లే ఈ స్మార్ట్ ఫోన్ సొంతం. 144Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను ప్రత్యేకంగా అందించారు.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 68 వాట్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.

ఇక కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్ రెయిర్ కెమెరాను అందించారు. ఇందులో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 13 ఎంపీ, 2 ఎంపీ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.




