Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OnePlus 12: సరికొత్త లుక్‌లో వన్‌ప్లస్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. కెమెరా క్లారిటీ అదుర్స్‌ అంతే

ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ సెగ్‌మెంట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్‌ గత కొన్ని రోజులుగా బడ్జెట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చింది. రూ. 25 వేలలోపు మంచి ఫీచర్స్‌తో కూడిన ఫోన్‌లను తీసుకొచ్చిన వన్‌ప్లస్‌ ఇప్పుడు మళ్లీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. వన్‌ప్లస్‌ 12 పేరుతో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ప్రస్తుతం ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Sep 08, 2023 | 3:36 PM

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. వన్‌ప్లస్‌ 12 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఇప్పటి వరకు వన్‌ప్లస్‌ నుంచి రాని విభిన్న మోడల్‌లో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు.

1 / 5
ఈ ఏడాది చివరి నాటికి వన్‌ప్లస్‌ 12 స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వన్‌ప్లస్‌ ప్రణాళికలు రచిస్తోంది. కొత్త డిజైన్‌ లోగోతో ఈ ఫోన్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

2 / 5
ఇక నెట్టింట వైరల్ అవుతోన్న లీక్‌ల ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫ్లూయిడ్ ఎల్‌టీపీఓ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 2కే రిజల్యూషన్‌తో పనిచేయనున్నట్లు సమాచారం.

3 / 5
వన్‌ప్లస్‌ 12 స్మార్ట్ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ ద్వారా పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఆ కొత్త ఫోన్‌ను 16జీబీ లేదా 24 జీబీ ర్యామ్‌తో తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఇవ్వనున్నారు.

4 / 5
 ఇక ఈ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం. ఇందులో 64 మెగాపిక్సెల్ టెలిఫొటో, 50 మెగాపిక్సెల్‌తో కూడిన అల్ట్రా వైడ్‌ కెమెరాను అందించనున్నారని తెలుస్తోంది. అలాగే సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నారని టాక్‌.

5 / 5
Follow us