Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nokia G42 5G: దూకుడు పెంచిన నోకియా.. మరో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌, తక్కువ బడ్జెట్‌లోనే

ఒకప్పుడు ఫీచర్ ఫోన్స్‌ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన నోకియా ఆ తర్వాత స్మార్ట్ ఫోన్‌ మార్కెట్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. విండోస్‌ ఫోన్స్‌ లాంచ్‌ చేసినా పెద్దగా టెక్‌ మార్కెట్లో నిలదొక్కుకోలేకపోయింది. అయితే నోకియా సైతం స్మార్ట్ ఫోన్‌ సెగ్మెంట్‌లో సత్తా చాటుతోంది. వరుసగా స్మార్ట్ ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తూ మార్కెట్లో గట్టి పోటీనిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త 5జీ ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. నోకియా జీ42 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Sep 08, 2023 | 4:43 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం నోకియా తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. నోకియా జీ42 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. సెప్టెంబర్‌ 11వ తేదీన ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. అమెజాన్‌తో పాటు అధికారిక వెబ్‌సైట్‌లోకి అందుబాటులోకి రానుంది. నోకియా నుంచి ఇండియాలో లాంచ్‌ కానున్న రెండో 5జీ ఫోన్‌ ఇదే కావడం విశేషం.

1 / 5
నోకియా జీ42 స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 90Hz రిఫ్రెష్ రేట్, వాటర్‌ డ్రాప్‌ నాచ్‌ ఈ డిస్‌ప్లే ప్రత్యేకతగా చెప్పొచ్చు.

2 / 5
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 480 ప్లస్‌ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అలాగే 11 జీబీ వరకు ర్యామ్‌ను అందించనున్నారు. ఓజో ప్లేబ్యాక్‌ పవర్డ్‌ లౌడ్ స్పీకర్‌ ఈ స్మార్ట్ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

3 / 5
కెమెరా విషయానికొస్తే నోకియా జీ42 5జీ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు.

4 / 5
నోకియా జీ42 5జీ ఫోన్‌ రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ అప్‌గ్రేడ్‌ను అందించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను ఇవ్వనున్నారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. ధర విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ రూ. 20 నుంచి రూ. 25 వేల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

5 / 5
Follow us