- Telugu News Photo Gallery Technology photos Oppo launches new smartphone Oppo a38 features and price details Telugu Tech news
Oppo A38: తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా.? ఇదే బెస్ట్ ఆప్షన్..
బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని మార్కెట్లోకి కొంగొత్త స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో తాజాగా ఇండియన్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో ఏ38 పేరుతో ఇప్పటికే యూఏఈలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకానికి రానుంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Sep 09, 2023 | 10:30 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పటో ఏ38 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధర రూ. 12,999గా ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1612x720 పిక్సెల్స్‌తో కూడిన 6.56 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ డిస్‌ప్లే ప్రత్యేకతగా చెప్పొచ్చు.

ఆండ్రాయిడ్ 13 బేస్‌డ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో అక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇచ్చారు.

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ రెయిర్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. ఇక సెల్ఫీల కోసం ఇందులో 5 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

బ్యాటరీ విషయానికొస్తే ఒప్పో ఏ38 స్మార్ట్ ఫోన్‌లో 33 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.





























