BoAt Smart Ring: వేలిక పెట్టుకొనే ఉంగరమే డాక్టరైతే! ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ స్మార్ట్ రింగ్ గురించి తెలుసుకోవాల్సిందే!
ఇప్పటి వరకూ బడ్జెట్ ధరల్లో స్మార్ట్ వాచ్లు, ఇయర్ బడ్స్, స్పీకర్స్ వంటి ఉత్పత్తులను లాంచ్ చేస్తూ వచ్చిన బోట్ ఇప్పుడు మరో సరికొత్త గ్యాడ్జెట్ ను పరిచయం చేస్తోంది. దాని పేరు బోట్ స్మార్ట్ రింగ్. దీనిని వెలికి పెట్టుకోవడం ద్వారా వినియోగదారుల హార్ట్ రేట్, స్టెప్ కౌంట్, నిద్ర నాణ్యత, ఆక్సిజన్ మోనిటరింగ్, ఫిట్ నెస్ ట్రాకింగ్ చేయవచ్చు.
ప్రపంచం వేగంగా పరుగెడుతోంది. సాంకేతికత రోజురోజుకీ మారిపోతోంది. సరికొత్త ఫీచర్లు, అత్యాధునిక సౌకర్యాలు మనిషికి చేరువవుతున్నాయి. ఇప్పటి వరకూ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ లు మార్కెట్లో ఒక ట్రెండ్ సెట్ చేశాయి. ముఖ్యంగా స్మార్ట్ వాచ్ లు తమదైన ముద్ర వేసుకున్నాయి. అత్యాధునిక హెల్త్ ఫీచర్లు, ఫిట్ నెస్ ట్రాకర్లతో వినియోగదారులను ఆకర్షించాయి. ఇక ఇప్పుడు మరో కొత్త గ్యాడ్జెట్ మిమ్మల్ని ఆశ్చర్యచకితులను చేయడానికి వచ్చేస్తోంది. అది బోట్ కంపెనీ నుంచి వస్తోంది. ఇప్పటి వరకూ బడ్జెట్ ధరల్లో స్మార్ట్ వాచ్లు, ఇయర్ బడ్స్, స్పీకర్స్ వంటి ఉత్పత్తులను లాంచ్ చేస్తూ వచ్చిన బోట్ ఇప్పుడు మరో సరికొత్త గ్యాడ్జెట్ ను పరిచయం చేస్తోంది. దాని పేరు బోట్ స్మార్ట్ రింగ్. అంటే ఇది ఒక ఉంగరం. దీనిని ఎంచక్కా వేలికి స్టైల్ గా పెట్టుకోవచ్చు. దీని ద్వారా వినియోగదారుల హార్ట్ రేట్, స్టెప్ కౌంట్, నిద్ర నాణ్యత, ఆక్సిజన్ మోనిటరింగ్, ఫిట్ నెస్ ట్రాకింగ్ చేయవచ్చు. అలాగే ఇది 5ఏటీఎం నీటి, చెమట రెసిస్టెన్స్ తో వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, లభ్యత వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
బోట్ స్మార్ట్ రింగ్ ఫీచర్లు..
ఈ స్మార్ట్ రింగ్ లో అనేక రకాల హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు, శరీర ఉష్ణోగ్రతను తెలుసుకునేందుకు అవసరమైన ఫీచర్లు ఉన్నాయి. అలాగే స్టెప్ కౌంట్, కేలరీస్ బర్నింగ్, ఆక్సిజన్ మోనిటరింగ్ వంటివి చేస్తుంది. అంతేకాక దీనిలో బాడీ రికవరీ ట్రాకింగ్ అనే సరికొత్త ఫీచర్ ను తీసుకొస్తున్నారు. దీంతో నిద్ర నాణ్యత, నిద్ర తర్వాత శరీరం తిరిగి శక్తిని పొందుకుందా లేదో కూడా చెబుతుంది. అలాగే మహిళల్లో రుతు చక్రం ట్రాకింగ్ ఉంటుంది. వారికి నోటిఫికేషన్లు, అలెర్ట్స్ పంపుతుంది. దీనిలో స్మార్ట్ టచ్ కంట్రోల్స్ ఉంటాయి. బోట్ రింగ్ యాప్ ద్వారా ఉంగరం ధరించిన వ్యక్తుల పూర్తి ఆరోగ్య సమాచారాన్ని గ్రాఫిక్స్ రూపంలో ఇది పొందుపరచి చూపుతుంది.
బోట్ స్మార్ట్ రింగ్ లభ్యత..
కొన్ని రిపోర్టుల ప్రకారం ఈ స్మార్ట్ రింగ్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తో పాటు బోట్ అధికారిక వెబ్ సైట్లో త్వరలో అమ్మకానికి రానుంది. అయితే ఈ రింగ్ ధరను బోట్ ఇంకా ప్రకటించలేదు. స్మార్ట్ రింగ్ మార్కట్ కూడా మన దేశంలో క్రమంగా పెరుగుతోంది. అల్ట్రా హ్యూమన్ రింగ్ ఎయిర్ అనే స్మార్ట్ రింగ్ ఇప్పటికే మన దేశంలో రూ. 24,999కి లాంచ్ అయ్యింది. కాగా మార్కెట్లో నడుస్తున్న చర్చల ప్రకారం శామ్సంగ్ కూడా ఈ రింగ్ తయారీని చేపట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే స్మార్ట్ రింగ్ ను శామ్సంగ్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..