Vivo Y27: వివో నుంచి మరో సూపర్ స్మార్ట్ ఫోన్ రిలీజ్.. డిజైన్.. ఫీచర్లు.. ధర వివరాలివే..!
తాజాగా వివో వై 27 పేరుతో మళ్లీ భారత మార్కెట్‌లో మరో కొత్త ఫోన్‌ను రిలీజ్ చేసింది. ముఖ్యంగా చార్జింగ్ విషయంలో వినియోగదారలకు మద్దతునిస్తూ ఈ ఫోన్ మార్కెట్‌లోకి దూసుకువస్తుంది. వివో వై-27 లాంచ్‌తో దాని వై-సిరీస్‌కి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను జోడించింది.

భారతదేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు వివిధ స్మార్ట్ ఫోన్లను ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నారు. కచ్చితంగా ప్రతి కంపెనీ నెలలో ఓ ఫోన్ లాంచ్ అయ్యేలా చూసుకుంటుంది. భారత మార్కెట్‌లో వివో కంపెనీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవల కాలంలో వివిధ కంపెనీల నుంచి గట్టి పోటీ ఎదురవడంతో కంపెనీ సేల్స్ పరంగా కొంతమేర వెనుకబడిది. అయితే తాజాగా వివో వై 27 పేరుతో మళ్లీ భారత మార్కెట్‌లో మరో కొత్త ఫోన్‌ను రిలీజ్ చేసింది. ముఖ్యంగా చార్జింగ్ విషయంలో వినియోగదారలకు మద్దతునిస్తూ ఈ ఫోన్ మార్కెట్‌లోకి దూసుకువస్తుంది. వివో వై-27 లాంచ్‌తో దాని వై-సిరీస్‌కి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను జోడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్లాస్ బాడీని కలిగి ఉంది. అలాగే ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ చిప్‌సెట్‌తో పని చేసే ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే ఈ ఫోన్ ధర కూ రూ.14,999గా ఉంటుంది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రెండు రంగు ఎంపికల్లో అందుబాటులో ఉంటుంది. బ్లాక్, గార్డెన్ గ్రీన్ రంగుల్లో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివో ఇండియా ఈ-స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు ఓ సారి తెలుసుకుందాం.
వివో వై 27 ఫీచర్లు ఇవే
- ఈ స్మార్ట్ ఫోన్ 1080×2388 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.64 అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, గరిష్ట ప్రకాశాన్ని 600 నిట్‌ల వరకు అందిస్తుంది.
- 6 జీబీ + 128 జీబీ వేరియంట్లో వచ్చే ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియక్ష జీ 85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
- ఈ స్మార్ట్‌ఫోన్ 6 జీబీ వరకు వర్చువల్ ర్యామ్ మద్దతును కూడా అందిస్తుంది. ఈ ఫోన్ మెమరీని మైక్రో ఎస్‌డీ కార్డ్‌ని జోడించడం ద్వారా మరింత విస్తరించవచ్చు.
- ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను నడుస్తుంది.
- 50 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో డ్యూయల్ బ్యాక్ కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
- అలాగే సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.
- సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వచ్చే ఈ ఫోన్లో 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం