WhatsApp New Feature: వాట్సాప్ కాలింగ్ చేసే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి అద్భుతమైన ఫీచర్‌.. వివరాలు ఇవి..

ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ కాలింగ్ లో మరో అప్ డేట్ ను అందించింది. కొన్ని రిపోర్టుల ఆధారంగా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ను ఒకేసారి 15 మందితో ప్రారంభించవచ్చు. అంటే ప్రస్తుతం ఉన్న సంఖ్యకు ఇది డబుల్ అన్నమాట.

WhatsApp New Feature: వాట్సాప్ కాలింగ్ చేసే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి అద్భుతమైన ఫీచర్‌.. వివరాలు ఇవి..
Whatsapp
Follow us
Madhu

|

Updated on: Jul 22, 2023 | 6:15 PM

మెటా యాజమాన్యంలో ఇన్ స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్ లలో ఇదే ప్రథమ స్థానంలో ఉంటుంది. వినియోగదారుల అవసరాలను గుర్తించడంలోనూ వాట్సాప్ చాలా ముందుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్లను తీసుకొస్తుంది. సరికొత్త ఫీచర్లను ఆవిష్కరిస్తుంటుంది. అదే క్రమంలో ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ కాలింగ్ లో మరో అప్ డేట్ ను అందించింది. కొన్ని రిపోర్టుల ఆధారంగా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ కాలింగ్ ను ఒకేసారి 15 మందితో ప్రారంభించవచ్చు. అంటే ప్రస్తుతం ఉన్న సంఖ్యకు ఇది డబుల్ అన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

అప్ గ్రేడెడ్ ఫీచర్ వివరాలు ఇవి..

వాట్సాప్ గ్రూప్ కాల్ మొత్తం 32 మంది పాల్గొనేలా అవకాశం ఉండగా.. కాల్ ప్రారంభంలో మాత్రం ఏడుగురు మాత్రమే ఉండగలరని గతేడాది నవంబర్ లో మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చెప్పారు. ఇప్పుడు అదే అప్లికేషన్ ను అప్ గ్రేడ్ చేసిన వాట్సాప్ గ్రూప్ కాల్ ప్రారంభంలోనే 15 మంది వరకూ పాల్గొనే అవకాశాన్ని కల్పించింది. సరికొత్త బీటా వెర్షన్ 2.23.15.14 వెర్షన్లో ఈ కొత్త అప్ డేట్ అందుబాటులోకి వచ్చింది. ఇది గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. వాబీటా ఇన్ ఫో చెబుతున్న దాని ప్రకారం మార్క్ జుకర్ బర్గ్ 2022 నవంబర్ లో తొలిసారి ఈ టెక్నాలజీ గురించి వివరించారు. గ్రూప్ కాల్ 32 మందితో ఒకేసారి మాట్లాడవచ్చని, కానీ కాల్ ప్రారంభమయ్యేది మాత్రం ఏడుగురితోనే.. అయితే ఇప్పుడు దీనిని 15 మందికి పెంచినట్లు పేర్కొంది. అంటే కాల్ 15 మంది ప్రారంభించి, 32 మంది వరకూ దానిలో యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది గ్రూప్ కాల్స్ ను మరింత సౌకర్యవంతంగా మార్చేస్తుందని వాబీటా ఇన్ ఫో పేర్కొంది.

పరీక్షల దశలో..

ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కొంతమంది బీటా వెర్షన్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వినియోగదారులు మీ వాట్సాప్ ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలని వాట్సాప్ సూచిస్తోంది. తద్వారా అకౌంట్ సెక్యూర్ గా ఉంటుందని పేర్కొంటుుంది. ఇదేకా వాట్సప్ మరో కొత్త ఫీచర్ ను యాడ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. వాట్సాప్ లో కాంటాక్ట్ సేవ్ చేయకుండానే మెసేజ్ పంపే విధంగా కొత్త అప్ డేట్ తీసుకొస్తోంది. ఇది కూడా ప్రస్తుతం పరీక్షల దశలోనే ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో