AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rocket Launch: రాకెట్ లాంచ్‌ సమయంలో లక్షల లీటర్ల నీరు ఎందుకు పోస్తారు? అసలు శాస్త్రీయ రహస్యం ఇదే!

Rocket Launch: రాకెట్ ఇంజిన్లు మండించినప్పుడు అవి అపారమైన శక్తిని, ఉష్ణోగ్రతను విడుదల చేస్తాయి. అయితే, రాకెట్‌కు అసలైన ప్రమాదం వాటి నుంచి వెలువడే భయంకరమైన శబ్ద తరంగాలు. లాంచ్ సమయంలో శబ్ద తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అత్యంత శక్తివంతమైన శబ్ద తరంగాలు రాకెట్‌ను..

Rocket Launch: రాకెట్ లాంచ్‌ సమయంలో లక్షల లీటర్ల నీరు ఎందుకు పోస్తారు? అసలు శాస్త్రీయ రహస్యం ఇదే!
Rocket Launch
Subhash Goud
|

Updated on: Oct 30, 2026 | 6:05 PM

Share

Rocket Launch: రాకెట్ ప్రయోగం అనగానే ఆకాశంలోకి దూసుకుపోయే అద్భుత దృశ్యం కళ్ళ ముందు మెదులుతుంది. అయితే, రాకెట్ లాంచ్‌కు కొన్ని సెకన్ల ముందు లక్షల లీటర్ల నీటిని లాంచ్ ప్యాడ్‌పై విడుదల చేయడం మనం టీవీల్లో చూసే ఉంటాం. ఇది కేవలం మంటలను చల్లార్చడానికి మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. కానీ అసలు విషయం అది కాదు. ఈ నీటి వ్యవస్థ వెనుక ఒక కీలకమైన శాస్త్రీయ కారణం ఉంది.

3. లక్షల లీటర్ల నీరు శబ్దాన్ని ఎలా తగ్గిస్తుంది?

రాకెట్ ఇంజిన్లు మండించినప్పుడు అవి అపారమైన శక్తిని, ఉష్ణోగ్రతను విడుదల చేస్తాయి. అయితే, రాకెట్‌కు అసలైన ప్రమాదం వాటి నుంచి వెలువడే భయంకరమైన శబ్ద తరంగాలు. లాంచ్ సమయంలో శబ్ద తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అత్యంత శక్తివంతమైన శబ్ద తరంగాలు రాకెట్‌ను, లాంచ్ ప్యాడ్‌ను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ శబ్ద తరంగాలు నేలను తాకి తిరిగి రాకెట్ వైపు దూసుకువస్తే ప్రమాదం మరింత పెరుగుతుంది.

అందుకే ఇంజిన్ల చుట్టూ భారీ మొత్తంలో నీటిని విడుదల చేస్తారు. ఈ నీరు సౌండ్ ఎనర్జీని గ్రహించి, దాని తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల రాకెట్‌తో పాటు లాంచ్ ప్యాడ్‌లోని సున్నితమైన సెన్సార్లు, కేబుల్స్, ఇతర పరికరాలు సేఫ్‌గా ఉంటాయి. ప్రయోగ సమయంలో కనిపించే భారీ తెల్లటి మేఘాలు పొగలు కావు. అవి వేడికి ఆవిరిగా మారిన నీరే. అంతేకాకుండా, రాకెట్ ఎగ్జాస్ట్ నుంచి వెలువడే కొన్ని హానికరమైన పదార్థాలను కూడా నీటి ప్రవాహం కిందకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. ఆధునిక రాకెట్ ప్రయోగాలలో ఈ వాటర్ సప్రెషన్ సిస్టమ్ ఒక ముఖ్యమైన రక్షణ వ్యవస్థగా మారింది.

ఒక ఖాళీ గదిలో గట్టిగా చప్పట్లు కొడితే శబ్దం గోడలకు తగిలి ప్రతిధ్వనిస్తుంది. అదే గదిలో తెరలు, ఇతర మృదువైన వస్తువులు ఉంటే ప్రతిధ్వని కొంత తగ్గుతుంది. ఎందుకంటే అవి శబ్ద శక్తిని కొంతవరకు గ్రహించి, ప్రతిబింబాన్ని తగ్గిస్తాయి. రాకెట్ లాంచ్ సమయంలో నీటి వ్యవస్థ కూడా మరింత సంక్లిష్టమైన రీతిలో ఇదే తరహా రక్షణను అందిస్తుంది. అయితే ఇది కేవలం శబ్దాన్ని గ్రహించడం మాత్రమే కాదు. నీటి ప్రవాహం, నీటి బిందువులు, వేడి వాయువుల మధ్య జరిగే పరస్పర చర్యల వల్ల పీడన తరంగాల తీవ్రత కూడా తగ్గుతుంది.

ఇది కూడా చదవండి: ఇస్రో GSLV-F18 రాకెట్‌ను ఎందుకు ప్రయోగిస్తోంది? భారతదేశానికి దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us