AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే

యూజర్లకు మెరుగైన ఫీచర్లను అందించడంతో పోటీ ఎంత ఉన్నా వాట్సాప్‌కు యూజర్లు దూరం కావడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఫొటోలు, వీడియోలు షేరింగ్‌లో సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే వాట్సాప్‌ హెచ్‌డీ క్వాలిటీతో కూడిన...

WhatsApp: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే
Whatsapp
Narender Vaitla
|

Updated on: Jan 22, 2024 | 10:33 PM

Share

ప్రతీ ఒక్క స్మార్ట్‌ఫోన్‌లో తప్పకుండా ఉండే యాప్స్‌లో వాట్సాప్ ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఏకైకా మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌కావడం విశేషం. దీనికి ప్రధాన కారణం యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకురావడమే. యూజర్ల అవసరాలకు అనుగుణంగా తీసుకొస్తున్న ఫీచర్లే వాట్సాప్‌ను అగ్ర స్థానంలో నిలిపింది.

యూజర్లకు మెరుగైన ఫీచర్లను అందించడంతో పోటీ ఎంత ఉన్నా వాట్సాప్‌కు యూజర్లు దూరం కావడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఫొటోలు, వీడియోలు షేరింగ్‌లో సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే వాట్సాప్‌ హెచ్‌డీ క్వాలిటీతో కూడిన ఫొటోలు/ వీడియోలను షేర్‌ చేసుకోవడానికి వీలుగా గతేడాది 2 జీబీ ఫైల్‌ షేరింగ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఇంటర్నెట్ అవసరం లేకుండానే పక్కన ఉన్న వారికి ఫొటోలు, వీడియోలు పంపించుకోవచ్చు. ఈ ఫీచర్‌ అచ్చంగా ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ ‘నియర్‌బై షేర్‌’, ఐఓఎస్‌ ‘ఎయిర్‌ డ్రాప్‌’ తరహాలో పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉంది. పూర్తికాగానే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్‌ వాబీటా ఇన్ఫో తెలిపింది.

ఇదిలా ఉంటే ఫొటో, వీడియోలు, ఆడియోలను పక్కన ఉన్న వారికి అత్యంత వేగంగా షేర్‌ చేసుకునేందుకుగాను ‘షేర్‌ ఇట్‌’ యాప్‌ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ యాప్‌పై కేంద్రం నిషేధం విధించడంతో గూగుల్‌ యూజర్ల కోసం ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో నియర్‌బై షేర్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో తాజాగా వాట్సాప్‌ నియర్‌బైకి పోటీగా ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి