Oppo Reno 11: ఒప్పో రెనో 11 స్మార్ట్ ఫోన్ ఎలా ఉంది.? ఫీచర్స్ ఎలా ఉన్నాయి..
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచే స్తుంది. ఒప్పో రెనో 11లో 67 వాట్స్ సూపర్ వీఓఓసీ ఫ్లాష్ ఛార్జ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని అందించారు. అదే రెనో11 ప్రో స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే ఇందులో 80 వాట్స్ సూపర్ వీఓఓసీ ఫ్లాష్ ఛార్జ్‌కు సపోర్ట్ చేసే...

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో ఇటీవల మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఒప్పో రెనో 11 సిరీస్‌లో భాగంగా కొత్త ఫోన్‌ను తీసుకొచ్చారు. అంతకుముందు చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ను జనవరి 12వ తేదీన బారత మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఒప్పో రెనో 11 సిరీస్‌లో భాగంగా.. ఒప్పో రెనో 11, 11ప్రో పేర్లతో రెండు ఫోన్‌లను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫోన్ ఎలా ఉంది.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి వివరాఉల ఇప్పుడు తెలుసుకుందాం..
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచే స్తుంది. ఒప్పో రెనో 11లో 67 వాట్స్ సూపర్ వీఓఓసీ ఫ్లాష్ ఛార్జ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని అందించారు. అదే రెనో11 ప్రో స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే ఇందులో 80 వాట్స్ సూపర్ వీఓఓసీ ఫ్లాష్ ఛార్జ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని అందించారు. అలాగే ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు.
120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ స్క్రీన్ టు బాడీ రేషియో 93 శాతం ఈ ఫోన్ స్క్రీన్ సొంతం. వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం హెచ్డీఆర్10+ సపోర్ట్‌ను ఈ ఫోన్‌లో అందించారు. ఇక ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో తీసుకొచ్చారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50ఎంపీ ప్రైమరీ, 32ఎంపీ పోట్రైట్, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరాతో కలిపి ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ విషయానికొస్తే ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌తో 4కే రిజల్యూషన్‌తో కూడిన వీడియోలను చిత్రీకరించవచ్చు.
ఒప్పో రెనో 11లో 5000ఎంఏహెచ్ బ్యాటరీని అందింఆచరు. అలాగే 67వాట్ సూపర్‌వీఓఓసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను అందించారు. దీంతో ఫోన్ ఛార్జింగ్ వేగంగా అవుతుంది. కేవలం 45 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది. ఇక 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




