AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. స్మార్ట్‌ఫోన్‌ లేకుండానే ఆ ఫీచర్‌ డెస్క్‌టాప్‌లోనూ..

WhatsApp: ప్రస్తుతం ఏ స్మార్ట్‌ఫోన్‌లో చూసినా వాట్సాప్‌ లేనిది ఉండదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు..

WhatsApp: వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. స్మార్ట్‌ఫోన్‌ లేకుండానే ఆ ఫీచర్‌ డెస్క్‌టాప్‌లోనూ..
Subhash Goud
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 07, 2021 | 7:37 AM

Share

WhatsApp: ప్రస్తుతం ఏ స్మార్ట్‌ఫోన్‌లో చూసినా వాట్సాప్‌ లేనిది ఉండదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. అందుకు తగినట్లుగానే వాట్సాప్‌ సంస్థ కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తూ వినియోగదారులను మరింతగా ఆకట్టుకుంటోంది. ఇక యూజర్లకు మరో గుడ్‌న్యూస్‌ అందించబోతోంది. త్వరలో ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌లతో పనిలేకుండా డెస్క్‌టాప్‌లలో సులభంగా వాట్సాప్‌ వెబ్‌ను వాడుకోవచ్చు. ఈ మల్టీ డివైజ్‌ ఫీచర్‌ ఆప్షన్‌ బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా, దీనిని త్వరలో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాట్సాప్‌ ప్రయత్నాలు చేస్తోంది.

వాట్సాప్‌ వెబ్‌ లాగిన్‌ కావాలంటే వాట్సాప్‌ ఆఫ్‌లైన్‌లో ఉంటే సరిపోతుంది. ఇకపోతే ఈ సదుపాయం ఉపయోగించుకోవాలంటే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం తప్పనిసరి. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే మీ కంప్యూటర్‌ను లాగౌట్‌ చేసే వరకు వాట్సాప్‌ వెబ్‌ను వినియోగించుకునే సదుపాయం ఉంటుంది. ఈ సౌకర్యం విండోస్‌ 10, విండోస్‌ 11, మాక్‌ ఓఎస్‌లలో వాట్సాప్‌ వెబ్‌ పని చేయనుందని వాట్సాప్‌ వెల్లడించింది. బీటా వెర్షన్‌ అందుబాటులో ఉంది. కాగా, ప్రస్తుతం వాట్సాప్‌ వెబ్‌పై పని చేస్తుండగా, పర్సనల్‌ కంప్యూటర్‌లలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే నేరుగా వాట్సాప్ వెబ్‌ ఓపెన్‌ అవుతుంది. అలా మన కంప్యూటర్‌లో ఒక్కసారి లాగిన్‌ అయితే లాగౌట్‌ చేయకపోయినా లాగిన్‌ అవుతుంది. ఇలా 14 రోజుల పాటు ఉంటుంది. ఆ తర్వాత క్యూఆర్‌ కోడ్‌ మళ్లీ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. అయితే గతంలో వాట్సాప్‌ మల్టీడివైజ్‌ ఆప్షన్‌ బీటావెర్షన్‌లో అందుబాటులో ఉండేది. ఈ ఫీచర్‌ను వాడుకోవాలంటే ముందుగా యూజర్లు బీటాను సెలక్ట్‌ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అందరికి కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విధంగా యూజర్లను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్‌ కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే చాలా ఫీచర్స్‌ను పరిచయం చేయగా, మరి కొన్ని ఫీచర్స్‌ ప్రయోగ దశలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

Whatsapp: మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడ్డ వాట్సాప్.. డిలీట్‌ ఎవ్రీ వన్‌ మెసేజ్‌ ఇక నుంచి..

చనిపోయిన వ్యక్తి వేలిముద్రలను ఎలా గుర్తిస్తారు..? ఫోన్‌ అన్‌లాక్‌ చేసేందుకు ఫింగర్‌ ప్రింట్‌ ఎందుకు పని చేయవు!

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌