WhatsApp: వాట్సాప్ కాల్స్‌లో ఆ ఇబ్బందులకు చెక్.. కొత్త ఫీచర్ వచ్చేసింది..
వాస్తవానికి వాట్సాప్ కాల్ మాట్లాడాలంటే యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కొత్త ఫీచర్ సాయంతో వాట్సాప్ ను ఓపెన్ చేయకుండానే ఆడియో లేదా వీడియో కాల్స్ ను ఉపయోగించవచ్చని చెబుతున్నారు. అందుకోసం యాప్ సింబల్ పైనే ఆడియె కాల్ బార్ ను అందించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రపంచంలో అత్యధిక శాతం మంది ప్రజలు వినియోగిస్తున్న ఏకైక సోషల్ మీడియా ప్లాట్ ఫారం వాట్సాప్. ఈ మెసేజింగ్ యాప్ లేకుండా ప్రస్తుతం భారతీయ సమాజాన్ని ఊహించలేం. అంతలా ఈ యాప్ నకు కనెక్ట్ అయిపోయారు జనాలు. విద్యార్థుల నుంచి స్నేహితులు, బిజినెస్ పర్సన్లు అందరికీ అతి పెద్ద సమాచార సాధనం ఈ వాట్సాప్. కేవలం మెసేజ్ లకు మాత్రమే కాక, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, స్టేటస్, చానల్స్ అంటూ అనేక మార్గాల ద్వారా వినియోగదారులకు మంచి అనుభూతిని అందిస్తుంది ఈ యాప్. ఇప్పటి కప్పుడు కొత్త ఫీచర్లను, అప్ డేట్ల రూపంలో అందిస్తూ మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తన వినియోగదారులను కాపాడుకుంటోంది. ఇదే క్రమంలో మరో కొత్త ఫీచర్ ను త్వరలోనే తీసుకురానున్నట్లు చెబుతున్నారు. ఇది వాట్సాప్ కాల్స్ కు సంబంధించిన ఫీచర్. వాస్తవానికి వాట్సాప్ కాల్ మాట్లాడాలంటే యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కొత్త ఫీచర్ సాయంతో వాట్సాప్ ను ఓపెన్ చేయకుండానే ఆడియో లేదా వీడియో కాల్స్ ను ఉపయోగించవచ్చని చెబుతున్నారు. అందుకోసం యాప్ సింబల్ పైనే ఆడియె కాల్ బార్ ను అందించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
వాట్సాప్ ఆడియో కాల్ బార్..
వాట్సాప్ ఆడియె కాల్ బార్ అనే కొత్త ఫీచర్ వాట్సాప్ తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను కొంతమంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చినట్లు చెబుతున్నారు. వాట్సాప్ బీటా వినియోగదారులు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా వాబాటా ఇన్ఫ్ఓ ప్రకారం.. వాట్సాప్‌లోని కాలింగ్ ఇంటర్‌ఫేస్ ను మినీ-స్క్రీన్ వెర్షన్ గా తీసుకొస్తున్నారు. ఈ కొత్త ఆడియో కాల్ బార్‌ని ఉపయోగించి, మీరు మెసేజింగ్ యాప్‌లోని ప్రధాన కాల్ ఇంటర్‌ఫేస్‌కి వెళ్లకుండానే కాల్స్ మాట్లాడవచ్చు. కాల్ లిఫ్ట్ చేయడం, మ్యూట్ చేయడం, కట్ చేయడం చేయవచ్చని చెబుతున్నారు. ఇది వాట్సాప్ కాలింగ్ ను చాలా సులభతరం చేస్తుందని వివరిస్తున్నారు.
ఎవరికి అందుబాటులో ఉందంటే..
ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ వినియోగదారుల్లో పరిమిత టెస్టర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ పరీక్షల్లో అంతా సక్రమంగా ఉండి.. బగ్-రహితంగా మారితే.. మీరు త్వరలో కొత్త అప్ డేట్ ను అందుకుంటారు. అయితే అది ఎప్పుడు అనేది వాట్సాప్ ఇంకా ప్రకటించలేదు.
మరిన్ని ఫీచర్లపై కృషి..
వాట్సాప్ బీటా వెర్షన్‌లో మరిన్ని ఫీచర్లపై పని చేస్తోంది. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ క్లౌడ్ స్టోరేజ్ బ్యాకప్ ఆప్షన్‌ను అందించడానికి ప్రయత్నిస్తోంది. ఇది ప్రకృతిలో అధునాతనమైనది. చాట్‌లు ఫోన్‌లో ఎక్కువ స్థలాన్ని తీసుకుంటాయి కాబట్టి, వాట్సాప్ స్టోరేజ్‌పై ప్రాథమిక వివరాలను అందిస్తుంది. అయితే త్వరలో మీరు స్టోరేజీని ఉపయోగించి కంటెంట్ రకంపై మరింత డేటాను పొందవచ్చు. ముఖ్యంగా వాట్సాప్ బిజినెస్ వినియోగదారులు ఈ కొత్త ఫీచర్ నుంచి ప్రయోజనం పొందవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..