Best 5G Phones Under 20K: ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. రూ. 20వేల లోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే..

మన దేశంలో అందుబాటులో ఉన్న టాప్ బ్రాండ్ల నుంచి బెస్ట్ 5జీ ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటి ధర కేవలం రూ. 20,000 లోపే ఉంటుంది. ఇటీవల కాలంలో 5జీ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా శామ్సంగ్, రియల్ మీ, షావోమి వంటి బ్రాండ్లు ఫీచర్ రిచ్ స్మార్ట్ ఫోన్లను అనువైన బడ్జెట్లోనే లాంచ్ చేస్తున్నాయి.

Best 5G Phones Under 20K: ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ.. రూ. 20వేల లోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే..
Oneplus Nord Ce 3 Lite
Follow us

|

Updated on: May 14, 2024 | 5:12 PM

మీరు మంచి బ్యాటరీ లైఫ్, అద్భుతమైన కెమెరా నాణ్యత, మృదువైన పనితీరుతో కూడిన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అయి ఉండాలని భావిస్తున్నారా? అయితే మీ వెతుకులాటకు ఇక ఫుల్ స్టాప్ పెట్టండి. మన దేశంలో అందుబాటులో ఉన్న టాప్ బ్రాండ్ల నుంచి బెస్ట్ 5జీ ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటి ధర కేవలం రూ. 20,000 లోపే ఉంటుంది. ఇటీవల కాలంలో 5జీ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా శామ్సంగ్, రియల్ మీ, షావోమి వంటి బ్రాండ్లు ఫీచర్ రిచ్ స్మార్ట్ ఫోన్లను అనువైన బడ్జెట్లోనే లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బ్రాండ్ల నుంచి రూ. 20,000 లోపు ఉండే బెస్ట్ స్మార్ట్ ఫోన్లను మీకు అందిస్తున్నాం.

ఐకూ జెడ్9 5జీ..

ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7200 చిప్ సెట్, మాలీ జీ610 జీపీయూ ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ ఉంటుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌ను పొందుతారు. మీరు ఇంటెన్సివ్ గ్రాఫిక్స్ పనులను సజావుగా నిర్వహించగలరని జీపీయూ నిర్ధారిస్తుంది. ఐపీ54 రేటింగ్తో దుమ్ము, స్ప్లాష్-నిరోధకతను కలిగిస్తుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ షూటర్, 2ఎంపీ డెప్త్ డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం, మీరు ముందు భాగంలో 16ఎంపీ కెమెరాను పొందుతారు. 8జీబీ /128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999 కాగా.. 8జీబీ/256జీబీ వెర్షన్‌ను సొంతం చేసుకోవడానికి మీరు రూ.21,999 ఖర్చు చేయాలి.

రియల్ మీ నార్జో 70 ప్రో 5జీ..

ఇది 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లే 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. పీక్ బ్రైట్ నెస్ 2,000 నిట్‌ల వరకు ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఈ ఫోన్ కి శక్తినిస్తుంది. అయితే మాలి జీ68 ఎంసీ4 జీపీయూ సున్నితమైన పనితీరును అందిస్తుంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ను అందిస్తుంది. ఈ ఫోన్ ట్రిపుల్ క్యామ్ సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ మాక్రో కెమెరాతో పాటు ముందు వైపు 16ఎంపీ ఫ్రంట్ షూటర్ సెల్ఫీలను క్యాప్చర్ చేస్తుంది. ఈ పరికరం ఆండ్రాయిడ్ 14 ఆధారంగా నడుస్తుంది. 8జీబీ/128జీబీ వేరియంట్ ధర రూ. 19,999గా ఉంది.

రెడ్ మీ నోట్ 13 5జీ..

ఈ స్మార్ట్ ఫోన్ లో మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్ సెట్, మాలి జీ57 జీపీయూ ఆధారంగా పనిచేస్తుంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ల ఛార్జర్ ను అందిస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంటుంది.

టెక్నో పోవా 6 ప్రో 5జీ..

ఈ ఫోన్లో 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో కూడిన 6.78 ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ను అందిస్తుంది. 2ఎంపీ పోర్ట్రెయిట్ షూటర్, 3 రెట్ల ఇన్-సెన్సార్ జూమ్‌తో కూడిన ప్రైమరీ సెన్సార్‌తో సహా ట్రిపుల్ రియర్ క్యామ్ సెటప్ ఉంటుంది. ఇది ఏఐ మద్దతు గల లెన్స్‌ను కూడా పొందుతుంది. డ్యూయల్-టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో కూడిన 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ యొక్క 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.19,999కి అందుబాటులో ఉంది.

వన్ ప్లస్ నోర్డ్ సీఈ3 లైట్..

క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. 6.72 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లోని ట్రిపుల్ రియర్ క్యామ్ సెటప్‌లో 108ఎంపీ ప్రైమరీ షూటర్, 2ఎంపీ డెప్త్ కెమెరా, 2ఎంపీ మాక్రో లెన్స్, సెల్ఫీల కోసం 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ప్రారంభంలో 8జీబీ/256జీబీ స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.17,999 ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్