Whats App Update: యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్ క్రేజీ అప్‌డేట్.. ఏఐ సాయంతో డిజిటల్ అవతార్..?
వినియోగదారులు ఆకట్టుకోవడానికి వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకుని వస్తుంది. వాట్సాప్‌లో మెటా ఏఐ పీచర్ గత నెలలో భారతదేశంలో ప్రారంభించారు. ఇప్పుడు వాట్సాప్‌తో సహా అన్ని మెటా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. గో-టు మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో వాట్సాప్ మెటా ఏఐ ఉచితంగా ఉపయోగించవచ్చు. మనకు వచ్చిన ఏ డౌట్ అయినా మెటాలో టైప్ చేసి సెండ్ చేస్తే దానికి సంబంధించిన ఆన్సర్ వస్తుంది. అయితే మెటా ఏఐను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది.
భారతదేశంలో ఇటీవల కాలంలో వాట్సాప్ యాప్‌ను ఉపయోగించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్ యాప్ ఉంటుందంటే ఈ యాప్ వాడకం ఎలా ఉందో? మనం అర్థం చేసుకోవచ్చు. వినియోగదారులు ఆకట్టుకోవడానికి వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకుని వస్తుంది. వాట్సాప్‌లో మెటా ఏఐ పీచర్ గత నెలలో భారతదేశంలో ప్రారంభించారు. ఇప్పుడు వాట్సాప్‌తో సహా అన్ని మెటా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. గో-టు మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో వాట్సాప్ మెటా ఏఐ ఉచితంగా ఉపయోగించవచ్చు. మనకు వచ్చిన ఏ డౌట్ అయినా మెటాలో టైప్ చేసి సెండ్ చేస్తే దానికి సంబంధించిన ఆన్సర్ వస్తుంది. అయితే మెటా ఏఐను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. మెటా ఏఐను ఉపయోగించి వినియోగదారులు తమ డిజిటల్ అవతార్‌లను సృష్టించేలా అప్‌డేట్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ ఫీచర్ అభివృద్ధి దశంలో ఉంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ తాజా అప్‌డేట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
రాబోయే కొత్త అప్‌గ్రేడ్ వినియోగదారులకు సంబంధించిన ఏఐ- పవర్డ్ ఇమేజ్‌లను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే ఫీచర్ మెటా ఏఐ సహాయంతో సృష్టించిన ఒకే ఫోటోల సెట్‌ను తీయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. వినియోగదారులు ఈ చిత్రాలను రూపొందించడానికి విశ్లేషించే సెటప్ ఫోటోలను తప్పక తీయాలి. అయితే అనంతరం వచ్చని చిత్రాలు వాటి రూపాన్ని కచ్చితంగా సూచిస్తాయి. మెటా ఏఐ సెట్టింగ్‌ల ద్వారా తమ సెటప్ ఫోటోలను ఎప్పుడైనా తొలగించవచ్చు కాబట్టి వినియోగదారులు ఈ ఫీచర్‌పై పూర్తి నియంత్రణను కలిగి ఉండటం గమనార్హం. మెటా ఏఐ చాట్‌లో “ఇమాజిన్ మి” అని టైప్ చేయడం ద్వారా ఇమేజ్‌ని రూపొందించమని వినియోగదారులు మెటా ఏఐను అడగవచ్చు.
అలాగే వినియోగదారులు “@Meta AI imagine me” అని టైప్ చేయడం ద్వారా ఇతర చాట్‌లలో ఈ ఫీచర్‌ను ఉపయోగించగలరు. కమాండ్ విడిగా ప్రాసెస్ చేస్తున్నందున మెటా ఏఐ ఇతర సందేశాలను చదవదు. అందువల్ల వినియోగదారు గోప్యత ఎల్లప్పుడూ భద్రంగా ఉంటుంది. అయితే ఈ ఫీచర్ ఐచ్ఛికం, వినియోగదారులు ఎంపిక చేసుకోవడం అవసరం. దీని అర్థం ఈ ఫీచర్‌ని ఉపయోగించాలనుకునే వినియోగదారులు తమ సెట్టింగ్‌లలో దీన్ని మాన్యువల్‌గా ప్రారంభించాలి. ముందుగా వారి సెటప్ చిత్రాలను తీసుకోవాలి. మెటా ఏఐను ఉపయోగించి వినియోగదారులు తమ చిత్రాలను రూపొందించుకోవడానికి అనుమతించే ఫీచర్ అభివృద్ధిలో ఉంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి