Upcoming Smartphones: జూలైలో లాంచ్ కానున్న టాప్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. జాబితా కొంచెం పెద్దదే..

ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 3ప్రో, షావోమీ 14 సివి, రియల్‌మీ జీటీ6, మోటోరోలా ఎడ్జ్‌ 50 అల్ట్రా వంటి ఫోన్లు మార్కెట్లోకి వచ్చేందుకు ముహూర్తాన్ని ఫిక్స్‌ చేశాయి. వీటితో పాటు రెడ్‌మీ 13 5జీ, సీఎంఎఫ్‌ ఫోన్‌1తో పాటు మోటోరోలా, శామ్సంగ్‌ నుంచి ప్రీమియం ఫోల్డబుల్‌ ఫోన్లను కూడా ఈ జూలైలోనే లాంచ్‌ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

Upcoming Smartphones: జూలైలో లాంచ్ కానున్న టాప్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. జాబితా కొంచెం పెద్దదే..
Samsung Galaxy Z Fold 6
Follow us

|

Updated on: Jul 04, 2024 | 4:47 PM

జూలై మాసాన్ని అనేక టెక్‌ కంపెనీలు తమ లక్కీ నెలగా మార్చుకుంటున్నాయి. అందుకే వరసపెట్టి స్మార్ట్‌ ఫోన్లను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. వాటిల్లో టాప్‌ బ్రాండ్లు అయిన వివో, షావోమీ, రియల్‌మీ, మోటోరోలా వంటివి ఉ‍న్నాయి. వీటిల్లో పలు ప్రీమియం మోడళ్లు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 3ప్రో, షావోమీ 14 సివి, రియల్‌మీ జీటీ6, మోటోరోలా ఎడ్జ్‌ 50 అల్ట్రా వంటి ఫోన్లు మార్కెట్లోకి వచ్చేందుకు ముహూర్తాన్ని ఫిక్స్‌ చేశాయి. వీటితో పాటు రెడ్‌మీ 13 5జీ, సీఎంఎఫ్‌ ఫోన్‌1తో పాటు మోటోరోలా, శామ్సంగ్‌ నుంచి ప్రీమియం ఫోల్డబుల్‌ ఫోన్లను కూడా ఈ జూలైలోనే లాంచ్‌ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయా ఫోన్లకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని మీకు అందిస్తున్నాం.

రెడ్‌మీ 13 5జీ..

రెడ్‌మీ 1350 క్రిస్టల్ గ్లాస్ డిజైన్, 108ఎంపీ ప్రైమరీ కెమెరా, స్నాప్ డ్రాగన్ 4 జెన్‌ 2, చిప్‌సెట్‌, 33వాట్ల ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్టు, హైపర్‌ఓఎస్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన 5,030ఎంఏహెచ్‌ బ్యాటరీని అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్‌ జూలై 9న భారతదేశంలో లాంచ్ అవుతుంది. దీని రూ.12,000-రూ. 13,000 మధ్య ఉండే అవకాశం ఉంది.

సీఎంఎఫ్‌ ఫోన్ 1..

ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 5జీ చిప్ సెట్, సూపర్ అమోల్డ్‌ డిస్ ప్లే వస్తుంది. సీఎంఎఫ్‌ వాచ్ ప్రో 2, బడ్స్ ప్రో 2లతో కలిపి లాంచ్‌ కానున్నాయి. నథింగ్ సబ్-బ్రాండ్‌గా ఈ ఫోన్‌ లాంచ్‌ అవుతోంది. జూలై 8న మార్కెట్లోకి వస్తోంది. దీని ధర రూ. 20,000 లోపు ఉండవచ్చని భావిస్తున్నారు.

మోటోరోలా రాజ్‌ఆర్‌ 50 అల్ట్రా..

మోటోరోలా నుంచి ఫ్లాగ్లిప్ క్లామ్ షెల్ స్నాప్ డ్రాగన్ 8ఎస్‌ జెన్‌ 3 చిప్ సెట్, 165హెర్జ్‌ స్క్రీన్, 50ఎంపీ ఓఐఎస్‌ ప్రైమరీ కెమెరా, 50ఎంపీ టెలిఫోటో సెన్సార్, 45వాట్ల వైర్డ్, 15వాట్ల వైర్ లెస్ ఛార్జింగ్‌తో వస్తుంది. 4,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్‌ జూలై 4న లాంచ్ అవుతోంది. ఈ ఫోల్డబుల్ హ్యాండ్సెట్ ధర రూ. 75,000 ధర బ్రాకెట్లో ఉండవచ్చు.

శామ్సంగ్‌ గెలాక్సీ జెడ్ ఫోల్డ్‌ 6, గెలాక్సీ 2 ఫ్లిప్‌ 6..

ఈ రెండు ఫోన్లలో గెలాక్సీ చిప్ సెట్, కొత్త గెలాక్సీ ఏఐ ఫీచర్లల కోసం స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 30 చిప్‌ సెట్‌ ఉంటుంది. శామ్సంగ్‌ గెలాక్సీ జెడ్ ఫోల్డ్‌ 6 రూ. 1,69,999 గెలాక్సీ 2 ఫ్లిప్‌ 6 రూ. 1,09,999 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ధరలను శామ్సంగ్‌ ధ్రువీకరించలేదు. ఈ రెండు ఫోల్డబుల్ ఫోన్లు జూలై 10న గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌-2024 ఈవెంట్లో ప్రారంభించుకునే అవకాశం ఉంది.

మరిన్ని లాంచ్‌ అయ్యే అవకాశం..

ఒప్పో, టెక్‌నో, లావా, హానర్‌ వంటి మరిన్ని బ్రాండ్లు తమ కొత్త స్మార్ట్‌ ఫోన్లను లంచ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పలు ఆన్‌లైన్‌ నివేదికలు చెబుతున్నాయి. ఇన్ఫినిక్స్‌ ఇటీవల నోట్‌ 40జీ ప్రారంభించింది. దీని తర్వాత నోట్ 408 4జీని తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అలాగే టెక్నో స్పార్క్ 20ని విడుదల చేయనుంది. ఇది డైమెన్సీటీ 6080 చీప్ సెట్, 12042 డిస్ ప్లే, 108 ఎంపీ, ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది రూ. 11,000 ధర బ్రాకెట్లో ఉండే అవకాశం ఉంది. లావా అమెజాన్లో బ్లేజ్ ఎక్స్‌ను లాంచ్ చేసింది. మిడ్-రేంజ్ సెగ్మెంట్ విషయానికొస్తే, వన్ ప్లస్ ఈ నెలలో నోర్డ్ 4ని ఆవిష్కరించే అవకాశం ఉంది. రియల్ మీ 13 ప్రో సిరీస్ 5జీని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒప్పో రెనో 12 సిరీస్ 5జీని జూలై 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. హానర్ 200 5జీ సిరీస్ ను ఇప్పటికే అమెజాన్లో టీజ్ చేసింది. ఇది కూడా ఈ నెలలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.