Laptop: ల్యాప్‌టాప్ వర్షంలో తడిస్తే ఏం చేయాలి..? పొరపాటున ఈ తప్పులు చేస్తే వేలల్లో నష్టం..
ల్యాప్‌టాప్‌లోకి ఒక చుక్క నీరు పోయిన భారీ నష్టం వాటిల్లుతుంది. కానీ చిన్న చిన్న ఉపాయాలతో వేల ఖర్చును ఆదా చేసుకోవచ్చు. వర్షంలో ల్యాప్‌టాప్ తడిసిన తర్వాత మీరు ఏం చేయాలి..? ఏం చేయొద్దు..? అనేవి తెలిసి ఉండాలి. లేకపోతే మీకు వేలల్లో నష్టం జరగవచ్చు.

వర్షాకాలం వచ్చిందంటే ఆరోగ్యంతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ల్యాప్‌టాప్‌ల విషయానికి వస్తే, ఒక చుక్క నీరు కూడా భారీ నష్టాన్ని కలిగిస్తుంది. మీ ల్యాప్‌టాప్ వర్షంలో తడిసిన వెంటనే కంగారు పడకుండా సరైన చర్యలు తీసుకోండి. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల మీకు వేల ఖర్చులు పెరుగుతాయి. అదేవిధంగా చిన్న ఉపాయలతో వేల రూపాయలు ఆదా అవుతాయి. వర్షంలో తడిసిన తర్వాత ల్యాప్‌టాప్‌లో ఏం చేయాలి..? ఏం చేయొద్దు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ల్యాప్‌టాప్ షట్ డౌన్
మీ ల్యాప్‌టాప్ ఆన్‌లో ఉండి వర్షంలో తడిస్తే.. వెంటనే షట్ డౌన్ చేయండి. పవర్ ఆన్‌లో ఉంటే లోపల ఉన్న నీటితో షార్ట్ సర్క్యూట్ సంభవించవచ్చు, ఇది మదర్‌బోర్డ్, స్క్రీన్ లేదా బ్యాటరీని దెబ్బతీస్తుంది.
పవర్ సోర్స్ – యాక్సెసరీలను తీసివేయాలి
ఛార్జర్, యూఎస్‌బీ డ్రైవ్, హెడ్‌ఫోన్‌లు లేదా ఏదైనా పరికరం కనెక్ట్ చేసి ఉంటే, దానిని వెంటనే తీసివేయండి. బ్యాటరీ రిమూవ్ చేసే ఆప్షన్ ఉంటే దానిని కూడా తొలగించండి.
ల్యాప్‌టాప్‌ను ఆరబెట్టండి
టవల్ లేదా శుభ్రమైన కాటన్ వస్త్రంతో ల్యాప్‌టాప్‌ను తుడవండి. లోపల ఉన్న నీరు బయటకు పోయేలా తలక్రిందులుగా ఉంచండి. కనీసం 24 నుండి 48 గంటలు దాన్ని ఆన్ చేయవద్దు.
హెయిర్ డ్రైయర్ లేదా హీటర్‌తో ఆరబెట్టొద్దు
చాలా మంది ల్యాప్‌టాప్‌ను ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్ లేదా హీటర్లను ఉపయోగిస్తారు. ఇది పెద్ద తప్పు. ఇది ల్యాప్‌టాప్ లోపల సర్క్యూట్‌లను కరిగించగలదు. సహజ గాలి లేదా గది ఉష్ణోగ్రత ఉత్తమ మార్గం.
బియ్యం లేదా సిలికా జెల్ పద్ధతి
ఒక పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని దానిలో ల్యాప్‌టాప్‌ను ఉంచండి. బియ్యం లేదా సిలికా జెల్ ప్యాక్‌ను దానితో ఉంచండి. ఇది తేమను గ్రహించడంలో సహాయపడుతుంది. ల్యాప్‌టాప్‌ను కనీసం 48 గంటలు ఈ పరిస్థితిలో ఉంచండి.
ఓపెన్ చేయవద్దు
మీకు తెలియకపోతే ల్యాప్‌టాప్‌ను మీరే తెరవడానికి ప్రయత్నించవద్దు. దీనివల్ల సమస్య మరింత పెరుగుతుంది.
వీలైనంత త్వరగా సర్వీస్ సెంటర్‌కు
పైన ఇచ్చిన అన్ని ఉపాయాలను అనుసరించిన తర్వాత కూడా ల్యాప్‌టాప్ పనిచేయకపోతే, లోపల ఏదో కాలిపోతున్నట్లు వాసన వస్తే, వెంటనే దానిని సర్వీస్ సెంటర్ లేదా మంచి టెక్నీషియన్ వద్దకు తీసుకెళ్లండి.
వర్షంలో ల్యాప్‌టాప్‌ను ఎలా కాపాడుకోవాలి
వర్షాకాలంలో ల్యాప్‌టాప్‌ను వాటర్‌ప్రూఫ్ బ్యాగ్ లేదా స్లీవ్ కేసులో ఉంచండి. బస్సులు లేదా బైక్‌లో ప్రయాణించేటప్పుడు ప్లాస్టిక్ కవర్‌ను ఉంచండి. రెయిన్‌కోట్‌లో నీరు దానిపై నేరుగా పడకుండా ముందుకు ఎదురుగా ల్యాప్‌టాప్‌ను ఉంచండి.
ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో వేల రూపాయలను ఆదా చేసుకోవచ్చు.




