AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Channel: వాట్సాప్ చానల్ గురించి తెలుసా? ఎలా వాడాలి? ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుందాం రండి..

యూట్యూబ్ చానల్ తెలుసు, ఇన్ స్టా పేజీ తెలుసు.. ఈ వాట్సాప్ చానల్ ఏంటి. అని ఆశ్చర్యపోతున్నారా? అలాంటి ఫీచరే ఇది కూడా. ఎవరైనా వాట్సాప్ చానల్ ను మొదలు పెట్టొచ్చు. ఎవరైనా ఎవరి చానల్ ను అయినా ఫాలో కావొచ్చు. వారి పోస్టులకు చూడవచ్చు. కానీ మీరు ఫాలో అవుతున్న చానల్ వివరాలు వేరే వ్యక్తులకు మాత్రం తెలియవు. ఒక్క చానల్ అడ్మిన్ కు తప్ప మీరు ఆ చానల్ ను ఫాలో అవుతున్న మిగిలిన ఫాలోవర్ల కూడా ఆ విషయం తెలీదు.

WhatsApp Channel: వాట్సాప్ చానల్ గురించి తెలుసా? ఎలా వాడాలి? ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుందాం రండి..
Whatsapp Channel
Madhu
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Oct 10, 2023 | 8:27 PM

Share

ప్రపంచంలో మేటి మేసేజింగ్ యాప్ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతోంది. తన వినియోగదారులకు కొత్తదనాన్ని పరిచయం చేయడంలో ఎప్పటికప్పుడు విజయవంతం అవుతోంది. కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ ముందుకెళ్తోంది. అందులో భాగంగానే తీసుకొచ్చిన ఫీచర్ వాట్సాప్ చానెల్స్. ఇటీవలే దీనిని లాంచ్ చేసింది. యూట్యూబ్ చానల్ తెలుసు, ఇన్ స్టా పేజీ తెలుసు.. ఈ వాట్సాప్ చానల్ ఏంటి. అని ఆశ్చర్యపోతున్నారా? అలాంటి ఫీచరే ఇది కూడా. ఎవరైనా వాట్సాప్ చానల్ ను మొదలు పెట్టొచ్చు. ఎవరైనా ఎవరి చానల్ ను అయినా ఫాలో కావొచ్చు. వారి పోస్టులకు చూడవచ్చు. కానీ మీరు ఫాలో అవుతున్న చానల్ వివరాలు వేరే వ్యక్తులకు మాత్రం తెలియవు. ఒక్క చానల్ అడ్మిన్ కు తప్ప మీరు ఆ చానల్ ను ఫాలో అవుతున్న మిగిలిన ఫాలోవర్ల కూడా ఆ విషయం తెలీదు. ఇటీవల దీని వినియోగిస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అయితే ఇంకా కొంత మందికి ఈ వాట్సాప్ చానల్ అంటే ఏమిటో తెలియడం లేదు. వాటి ప్రయోజనం అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో వాట్సాప్ చానల్ ను ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం రండి..

వన్ వే బ్రాడ్ కాస్ట్ టూల్..

టెక్స్ట్‌లు, వీడియోలు, సందేశాలను పంచుకోవడానికి వన్-వే బ్రాడ్‌కాస్ట్ టూల్‌గా పనిచేసే ఫీచర్ వాట్సాప్ చానల్. సింగపూర్, కొలంబియాలోని వినియోగదారులకు ఈ ఫీచర్ మొదట జూన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత జూలై నుంచి మరో ఏడు దేశాలకు విస్తరించించారు. తాజాగా అందించిన అప్ డేట్లో మన దేశంలోని చాలా మంది వినియోగదారులకు ఇది అందుబాటులోకి వచ్చిందని వాబీటా ఇన్ ఫో నివేదించింది. ఈ నివేదిక ప్రకారం ఎక్కువ మంది వినియోగదారులు ఈ ఫీచర్‌కు యాక్సెస్‌ను కలిగి ఉన్నారు. మీకు అప్‌డేట్ ఉందో లేదో తనిఖీ చేయడానికి, మీ వాట్సాప్ ఓపెన్ చేసి పైన బార్ లో చాట్ పక్కన స్టేటస్ స్థానంలో అప్‌డేట్‌ల ట్యాబ్‌లో మీకు కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు మీ కాంటాక్ట్ ల స్టేటస్ లతో పాటు కింద చానల్ సజెషన్స్ మీకు కనిపిస్తాయి. వాటిల్లో మీకు కావాల్సిన వారి చానల్ ను ఎంపిక చేసుకొని ఫాలో చేస్తే చాలు.. వారి అప్ డేట్లు అన్నీ మీకు కనిపిస్తాయి. అయితే ఇది అందరికీ అందుబాటులోకి రాకపోవచ్చు. వాట్సాప్ క్రమంగా ఛానెల్ ఫీచర్‌ను విడుదల చేస్తోంది. కాబట్టి తాజా అప్‌డేట్‌లతో కూడా అందరికీ తక్షణ ప్రాప్యత ఉండదు. అందువల్ల, ఇంకా ఈ ఫీచర్‌ని పొందని వారు రాబోయే వారాల్లో దీన్ని పొందే అవకాశం ఉంటుంది.

మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ గత నెలలో భారతదేశంతో సహా 150 కంటే ఎక్కువ దేశాలలో వాట్సాప్ ఛానెల్‌లను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించారు . ఇది వన్-వే బ్రాడ్‌కాస్టింగ్ సాధనంగా వర్ణించారు, ఇది ఎక్కువ మంది ప్రేక్షకులకు సందేశాలను పంపడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

ఇవి కూడా చదవండి

“ మీరు అనుసరించే వ్యక్తులు, సంస్థల నుంచి అప్‌డేట్‌లను పొందడానికి మీకు కొత్త ప్రైవేట్ మార్గం అయిన వాట్సాప్ ఛానెల్‌లకు మీ అందరినీ పరిచయం చేయడానికి సంతోషిస్తున్నాం. మెటా వార్తలు, అప్‌డేట్‌లను షేర్ చేయడానికి నేను ఈ ఛానెల్‌ని ప్రారంభిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా మీతో కనెక్ట్ అవ్వడానికి ఎదురుచూస్తున్నాను, ”అని అతను జుకర్ బర్గ్ తన ప్రైవేట్ వాట్సాప్ ఛానెల్‌లో పేర్కొన్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..