AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prompt Engineering: ఏఐ రంగంలో రాణించాలంటే ఈ ఒక్క స్కిల్ చాలు!

ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యం పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఏఐ రంగంలో రాణించాలనుకునేవాళ్లు దానికి తగ్గట్టుగా ఇప్పట్నుంచే స్కిల్స్‌పై ఫోకస్ పెట్టాలి. ఏఐ రంగంలో ధీటుగా రాణించేందుకు ఉండాల్సిన ఒకే ఒక్క స్కిల్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్. అవును. ఇది తెలిస్తే.. ఏఐ టెక్నాలజీలో మీరే కింగ్. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Prompt Engineering: ఏఐ రంగంలో రాణించాలంటే ఈ ఒక్క స్కిల్ చాలు!
Prompt Engineering
Nikhil
|

Updated on: Sep 21, 2025 | 4:56 PM

Share

కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 95 శాతం కార్పొరేట్ కంపెనీలు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను సమర్ధవంతంగా వాడుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండు వంతుల మంది ఉద్యోగులకు అసలు ఏఐ గురించిన మినిమమ్ నాలెడ్జి లేదని స్టడీలు చెప్తున్నాయి. ఏఐ గురించిన నాలెడ్జ్ అంటే సరైన ప్రాంప్ట్ ను వాడడం తెలియడం అన్న మాట.

ప్రాంప్ట్ అంటే..

ఏఐను వాడడం మనందరికీ తెలిసిన విషయమే అయినా.. ప్రొఫెషనల్ గా  ఏఐని వాడే పద్దతి అది కాదు. ఉదాహరణకు ఏఐకి 100 శాతం పని చేయగల సామర్థ్యం ఉంది అనుకుంటే దాంతో మనం కేవలం 20 శాతం పని మాత్రమే చేయించుకుంటున్నాం.  ఏఐని ఇంకాఎఫెక్టివ్ గా వాడాలంటే దానికి సరైన ప్రాంప్ట్స్ రాయడం తెలియాలి. అంతెందుకు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న బనానా ట్రెండ్ నే తీసుకుందాం. కొంతమంది సూపర్ గా ఫొటోస్ క్రియేట్ చేస్తుంటారు. కానీ, కొంతమంది ఏదో అలా బేసిక్ గా చేస్తుంటారు. తేడా ఏఐలో లేదు. మనం ఇచ్చే ప్రాప్ట్స్ లో ఉంది.

ఫుల్ డిమాండ్

ఏఐ అనేది సొంతంగా ఆలోచించి పని చేయగలిగే టూల్. అడిగిన విషయాన్ని బట్టి, ఇచ్చిన కోడ్‌ను బట్టి రిజల్ట్ ఉంటుంది. మనం ఇచ్చే ప్రాంప్ట్ ఎంత కచ్చితంగా ఉంటే రిజల్ట్ అంత స్పష్టంగా ఉంటుంది. ప్రాంప్ట్స్ అనేది ఏఐ టూల్స్‌లో అత్యంత ముఖ్యమైన అంశం. ఇలాంటి ప్రాంప్ట్‌లను డెవలప్ చేసేవారినే ప్రాంప్ట్ ఇంజినీర్లు అంటారు. ఈ స్కిల్ నేర్చుకున్నవారికి ఫ్యూచర్ లో ఫుల్ డిమాండ్ ఉండే అవకాశం ఉంది.

వీరిదే ఫ్యూచర్

ప్రాంప్ట్ ఇంజనీర్లను ఏఐ ప్రొడక్ట్ మేనేజర్లుగా కూడా వర్ణించొచ్చు. సంస్థలు ఏఐ టూల్స్ వాడాలనుకుంటే దానికి తగ్గట్టు ప్రాంప్ట్ ఇంజినీర్ తప్పక ఉండాలి. ఇది పూర్తిగా టెక్నికల్ స్కిల్, టెక్నికల్ నాలెడ్జితో పాటు ఇంగ్లిష్ లాంగ్వేజీపై కూడా పట్టు ఉండాలి. రాబోయే రోజుల్లో ప్రాంప్ట్ ఇంజినీర్లకు మంచి డిమాండ్ ఉండబోతోందని పలు జాబ్ పోర్టళ్లు చెప్తున్నాయి. కొన్ని సంస్థలు ఈ స్కిల్స్ ను కోర్సుల రూపంలో కూడా ఆఫర్ చేస్తున్నాయి.  ఏఐ రంగంలో రాణించాలనుకుంటే డిగ్రీలతో పాటు ఈ తరహా స్కిల్స్‌పై కాస్త పట్టు సాధిస్తే.. ఏఐ రంగంలో ఉద్యోగాలు సాధించడమే కాదు,  డైలీ లైఫ్ ని కూడా చాలా స్మార్ట్ గా మార్చుకోవచ్చు.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..