Calculator: క్యాలిక్యులేటర్‌లోని GT, MU, M+, M-, MRC బటన్ల అర్థాలు ఏంటో తెలుసా? ఇవి ఎందుకు ఉంటాయి?
Calculator: మీరు సాధారణంగా కాలిక్యులేటర్ ఉపయోగిస్తుంటే మీరు M+, M-, MR, MC వంటి బటన్లను చూసి ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఈ బటన్లను ఉపయోగించారా? ఈ బటన్ల పాత్ర మీకు తెలుసా? ఎటువంటి కారణం లేకుండా వాటికి కాలిక్యులేటర్‌లో స్థానం..

Calculator: మనం చిన్నప్పటి నుంచి కాలిక్యులేటర్ వాడుతున్నాం. నేటికీ దాన్ని వాడుతున్నాం. మన జీవితాన్ని సులభతరం చేయడంలో కాలిక్యులేటర్ చాలా ఉపయోగపడుతుంది. అయితే మొబైల్ ఫోన్లలో అందుబాటులో ఉన్న కాలిక్యులేటర్ సౌకర్యం అసలు కాలిక్యులేటర్ వాడకాన్ని చాలా వరకు తగ్గించింది. కానీ పెద్ద లెక్కలు వేయాల్సిన వ్యక్తులు, వారి పనిని మొబైల్ కాలిక్యులేటర్‌తో పూర్తి చేయలేరనడంలో సందేహం లేదు.
ఇది కూడా చదవండి: Metro Station: మెట్రో స్టేషన్‌లోకి అతిపెద్ద అరుదైన బల్లి.. హడలిపోయిన ప్రయాణికులు
సాధారణంగా కాలిక్యులేటర్‌ను కూడిక, తీసివేత కోసం ఉపయోగిస్తారు. మనం సాధారణంగా కాలిక్యులేటర్‌ను ప్లస్ (+), మైనస్ (-), గుణకారం (x), భాగహారం (÷) చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. అది ఎక్కువగా ఉంటే శాతాన్ని కనుగొనడానికి కూడా కాలిక్యులేటర్‌ను ఉపయోగిస్తాము. సాధారణ గణన కోసం ఉపయోగించే కాలిక్యులేటర్ బటన్‌ల గురించి మనకు బాగా తెలుసు. అయితే కాలిక్యులేటర్‌లో ఇంకా చాలా బటన్లు ఉన్నాయి. ఈ బటన్‌లను ఉపయోగించడం పక్కన పెడితే, మనలో చాలా మందికి వాటి పనితీరు ఏమిటో కూడా తెలియదు.
ఇది కూడా చదవండి: Cockroach: మీ ఇంట్లో బొద్దింకలు పెరిగిపోతున్నాయా? ఈ ట్రిక్స్ పాటిస్తే అస్సలు ఉండవు!
ఈ ప్రత్యేక బటన్ల యొక్క ప్రధాన విధులు మీకు తెలుసా?
మీరు సాధారణంగా కాలిక్యులేటర్ ఉపయోగిస్తుంటే మీరు M+, M-, MR, MC వంటి బటన్లను చూసి ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఈ బటన్లను ఉపయోగించారా? ఈ బటన్ల పాత్ర మీకు తెలుసా? ఎటువంటి కారణం లేకుండా వాటికి కాలిక్యులేటర్‌లో స్థానం లభించదని తెలుసుకోవడం ముఖ్యం. అతి పెద్ద విషయం ఏమిటంటే ఈ బటన్ల పనితీరు మనకు తెలియదు, దీని కారణంగా మనం కాలిక్యులేటర్‌ను పూర్తిగా ఉపయోగించలేకపోతున్నాము. ఇప్పుడు ఈ బటన్లు ఎంత ముఖ్యమైనవో, అవి ఏమి చేస్తాయో తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: GST Reduction: జీఎస్టీ తగ్గింపు తర్వాత ఏసీ, వాషింగ్ మెషీన్, టీవీల ధరలు ఎంత తగ్గుతాయో తెలుసా?
GT – గ్రాండ్ టోటల్ (Grand Total)
GT బటన్ మీకు గ్రాండ్ టోటల్‌ను చూపిస్తుంది. అంటే ఉదాహరణకు 6 × 2 = 12 అని ఒక గుణకారాన్ని వేసుకుని తరువాత 7 × 6 = 42 అనే వేరే లెక్కను వేసారనుకోండి. ఇప్పుడు GT అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు టోటల్ 50 (12 + 42 = 54) అనే ఆన్సర్ వస్తుంది. అందుకే ఇది పెద్ద పెద్ద మొత్తాలలో లెక్కలు చేసినప్పుడు సులభంగా మొత్తం గ్రాండ్ టోటల్ తెలుసుకోవడానికి పనికొస్తుంది. అవసరం అనుకుంటే మీరొకసారి ట్రై చేసి చూడండి.
MU – మార్కప్ (Mark-Up)
ఈ బటన్ ని ఖర్చు, లాభం, డిస్కౌంట్ లను ఖచ్చితంగా, సులభంగా తెలుసుకునేందుకు వాడుతారు. ఉదాహరణకి మీరు ఒక వస్తువును 400 రూపాయలకు కొనుగోలు చేశారు అనుకోండి. దానిపై 100 రూపాయల మీకు రావాలి.. అలాగే అదే సమయంలో కస్టమర్‌కు 20% డిస్కౌంట్ ఇవ్వాలి. అలాంటప్పుడు మీకు ఎంత ధరకు వస్తువు అమ్మితే కస్టమర్ కు 20 % డిస్కౌంట్ పోనూ మీకు వంద రూపాయల లాభం వస్తుందో లెక్కగట్టటానికి ఇది చాలా ఉపయోగం. అందుకే ఈ బటన్‌ను ఉపయోగిస్తారు.
ఇక్కడ మీరు కొన్న ధర 400 రూపాయలు. దీనిపై మీకు కావాల్సిన లాభం 100 రూపాయలు. అంటే మొత్తం రూ.500 అయింది. కస్టమర్ కు 20 శాతం డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి ముందుగా మీరు కాలిక్యులేటర్ లో మీరు కొన్న ధర ప్లస్ లాభం కలిపి 500. తరువాత MU బటన్ ను నొక్కి 20 శాతం ప్రెస్ చేస్తే మీకు 600 చూపిస్తుంది. అంటే మీరు కస్టమర్ కు చెప్పాల్సిన ధర 600 రూపాయలు. ఈ బటన్‌తో సులభంగా లెక్క తేలిపోతుంది.
M+, M-,MRC అంటే ఏమిటి?
ఈ రెండు బటన్లను ప్లస్ (+ ), మైనస్ (- ) లెక్కలలో రిజల్ట్ పొందేందుకు ఉపయోగిస్తారు. M+ అంటే మెమరీ ప్లస్, అలాగే M- అంటే మెమరీ మైనస్ ఇక MRC అంటే మెమరీ రీకాల్.
మీకు 10 ×3 అనే గుణకారం ( Multiply ) నుండి 2 ×3 అనే గుణకారాన్ని ( Multiply ) మైనస్ చెయ్యాలనుకుంటే ఈ బటన్లను ఎలా వాడాలో చూద్దాం. ముందుగా 10 ×3 = 30 ను కాలిక్యులేట్ చేసి M + బటన్‌ను నొక్కండి. అంటే ఇప్పుడు ఆ 30 మెమరీ చేయబడినది అర్థం. ఇప్పుడు దాంట్లోనుండి మైనస్ చెయ్యవలిసిన 2 ×3 అనే గుణకారం ను ప్రెస్ చెయ్యండి వచ్చే ఆన్సర్ 6. ఇప్పుడు మీకు మైనస్ ఆన్సర్ కోసం M – ను నొక్కండి. ఇక మొత్తం ఫైనల్ ఆన్సర్ కోసం MRC అంటే బటన్ ను నొక్కినట్లయితే మీకు ఆన్సర్ 24 వస్తుంది. అందుకే పెద్ద పెద్ద లెక్కలో చేసేప్పుడు పెన్‌తో పాటు పేపర్ లేకుండా చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Keyboard: కీబోర్డ్‌లో స్పేస్‌బార్ ఎందుకు అంత పొడవుగా, పెద్దగా ఉంటుంది? చాలా మందికి తెలియని విషయం ఇదే!
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








