Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo X100: వివో నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. రిలీజ్‌కు ముందే స్పెసిఫికేషన్లన్నీ లీక్‌.. పూర్తి వివరాలు

మరో కొత్త మోడల్‌ వివో ఎక్స్‌100 ను తీసుకొచ్చేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. నవంబర్‌ 13న అధికారికంగా మార్కెట్లో ఈ ఫోన్‌ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ ఫోన్‌ అధికారిక లాంచింగ్‌ ముందే దీని పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, ఫీచర్ల వంటి వివరాలు ఆన్‌లైన్లో లీక్‌ అయ్యాయి. ఇంతకు ముందు ఫోన్ల సిరీస్‌ వలే ఈ కొత్త సిరీస్‌ ఫోన్‌ కూడా మూడు వేరియంట్లలో రానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Vivo X100: వివో నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. రిలీజ్‌కు ముందే స్పెసిఫికేషన్లన్నీ లీక్‌.. పూర్తి వివరాలు
Vivo X100
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Nov 07, 2023 | 8:55 PM

మన దేశంలో వివో బ్రాండ్‌ ఫోన్లకు మంచి ఇమేజే ఉంది. స్టైలిష్‌ డిజైన్‌, ఆకర్షణీయ ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తుంటాయి. ఇటీవల వివో ఎక్స్‌90 సిరీస్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేయగా.. ఇప్పుడు మరో కొత్త మోడల్‌ వివో ఎక్స్‌100 ను తీసుకొచ్చేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. నవంబర్‌ 13న అధికారికంగా మార్కెట్లో ఈ ఫోన్‌ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ ఫోన్‌ అధికారిక లాంచింగ్‌ ముందే దీని పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, ఫీచర్ల వంటి వివరాలు ఆన్‌లైన్లో లీక్‌ అయ్యాయి. ఇంతకు ముందు ఫోన్ల సిరీస్‌ వలే ఈ కొత్త సిరీస్‌ ఫోన్‌ కూడా మూడు వేరియంట్లలో రానుంది. బేస్‌ మోడల్‌ వివో ఎక్స్‌100 కాగా.. వివో ఎక్స్‌100 ప్రో, వివో ఎక్స్‌100ప్రో ప్లస్‌ పేరిట రానున్నాయి. ఇప్పుడు ఆన్‌లైన్‌ లీక్ అయిన వివో ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

నాలుగు స్టోరేజ్‌ వేరియంట్లలో..

ఈ కొత్త వివో ఎక్స్‌100 ఫోన్‌ నాలుగు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుందని భావిస్తున్నారు. 12జీబీ + 256జీబీ, 16జీబీ + 256జీబీ, 16జీబీ + 512జీబీ, 16జీబీ + 1టీబీలలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర CNY 3,999 అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 45,600 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ బ్లాక్, బ్లూ, ఆరెంజ్, వైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. కాగా దీని ముందు మోడల్‌ వివో ఎక్స్‌ 90 ఫోన్‌ 8జీబీ + 128జీబీ వేరియంట్ CNY 3,699 అంటే మన కరెన్సీ దాదాపు రూ. 42,000 ధరతో ప్రారంభమైంది.

వివో ఎక్స్‌100 స్పెసిఫికేషన్లు..

రాబోయే వివో ఎక్స్‌100 ఫోన్లు 2,800 x 1,260 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300 ఎస్‌ఓసీ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఆరిజిన్‌ ఓఎస్‌ 4పై రన్‌ అవుతుంది. దీనిలో వెనుకవైపు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. రెండో కెమెరా ఓఐఎస్‌ సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమె మూడోది 64ఎంపీ పెరీస్కోప్‌ షూటర్‌ 100 రెట్ల డిజిటల్ జూమ్‌తో వస్తుంది. ఫోన్ ముందు వైపు 32-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 120వాట్ల వైర్డ్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్టుతో 5000ఎంఏహెచ్‌ సామర్థ్యంతో ఉంటుంది. కనెక్టివిటీ ఫీచర్లలో బ్లూటూత్ 5.4 ఐఆర్‌ సెన్సార్, వైఫై7, ఎన్‌ఎఫ్‌లకు మద్దతు ఇస్తుంది. దీనిలో భారతదేశ స్వదేశీ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ నావిక్‌తో వచ్చే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్‌ బరువు, 205 గ్రాములు, పరిమాణం 164 మిమీ x 75.2 మిమీ x 8.5 మిమీ ఉంటుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..