AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo Y 200: మరో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసిన వివో.. బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎవరో తెలుసా..?

తాజాగా ప్రముఖ కంపెనీ అయిన వివో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. వివో వై 200 5జీ పేరుతో రిలీజ్‌ చేసిన ఈ ఫోన్‌ ప్రముఖ బాలివుడ్‌ నటి సారా అలీఖాన్‌  బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. వివో వై  200 5 జీ స్మార్ట్‌ ఫోన్‌ అక్టోబర్‌ 23, 2023న మధ్యాహ్నం రిలీజ్‌ చేస్తుంది. ప్రారంభ టీజర్‌లో ఫోన్‌ విడుదల తేదీతో పాటు బాలివుడ్‌ నటి సారా అలీఖాన్‌ను కూడా టీజర్‌ ఫొటోలో ఉంది. అయితే ఈ ఫోన్‌ గురించి వివరాలు అధికారికంగా అందుబాటులో లేకపోయిన కొన్ని లీకైన వివరాలు మాత్రం హల్‌చల్‌ చేస్తున్నాయి.

Vivo Y 200: మరో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసిన వివో.. బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎవరో తెలుసా..?
Vivo Y 200
Nikhil
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 18, 2023 | 7:58 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగం భారీగా పెరిగింది. భారతదేశం జనాభా నేపథ్యంలో ఇక్కడ కూడా స్మార్ట్‌ ఫోన్‌ వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్‌ సమయం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్మార్ట్‌ ఫోన్‌ తప్పనిసరైంది. ముఖ్యంగా పిల్లల ఆన్‌లైన్‌ క్లాసుల నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌ ప్రతి ఇంటికి చేరింది. పెరిగిన డిమాండ్‌కు అనుగణంగా అన్ని కంపెనీలు సరికొత్త అప్‌డేట్స్‌ నయా స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేస్తున్నాయి.  తాజాగా ప్రముఖ కంపెనీ అయిన వివో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. వివో వై 200 5జీ పేరుతో రిలీజ్‌ చేసిన ఈ ఫోన్‌ ప్రముఖ బాలివుడ్‌ నటి సారా అలీఖాన్‌  బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. వివో వై  200 5 జీ స్మార్ట్‌ ఫోన్‌ అక్టోబర్‌ 23, 2023న మధ్యాహ్నం రిలీజ్‌ చేస్తుంది. ప్రారంభ టీజర్‌లో ఫోన్‌ విడుదల తేదీతో పాటు బాలివుడ్‌ నటి సారా అలీఖాన్‌ను కూడా టీజర్‌ ఫొటోలో ఉంది. అయితే ఈ ఫోన్‌ గురించి వివరాలు అధికారికంగా అందుబాటులో లేకపోయిన కొన్ని లీకైన వివరాలు మాత్రం హల్‌చల్‌ చేస్తున్నాయి. కాబట్టి వివో వై 200 ఫోన్‌ మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

వివో వై 200 ఫీచర్లు

  • వివో వై 200 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేటుతో 6.67 అంగుళాల ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పని చేస్తుంది. 
  • ఈ ఫోన్‌ 7.69 ఎంఎం మందంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
  • ఫొటోగ్రఫీ ఔత్సహికుల కోసం ఈ ఫోన్‌ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబులైజేషన్‌తో 64 ఎంపీ కెమెరాతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ ఫోన్‌ వివో వీ 29 ఫోన్‌ను జ్ఞప్తికి తెచ్చేలా స్మార్ట్‌ ఆరా లైట్‌ ఫీచర్‌తో వస్తుంది. ముఖ్యంగా అదనపు ఫొటోగ్రఫీ సామర్థ్యం కోసం 2 ఎంపీ పోర్ట్రెయిట్‌ కెమెరాతో వస్తుందని అంచనా వేస్తున్నారు.
  • వివో వై 200 ఫోన్‌ స్నాప్‌ డ్రాగన్‌ 4 జెన్‌ 1 చిప్‌సెట్‌ ద్వారా పని చేస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్‌ 8 జీబీ ర్మామ్‌తో పని చేస్తుంది. 
  • ఆండ్రాయిడ్‌ 13తో పని చేసే ఈ ఫోన్‌ ఫన్‌ టచ్‌ ఓఎస్‌ 13కు మద్దుతునిస్తుంది. 
  • వివో వై 200 ఫోన్‌ 44 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో 4800 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ ప్రత్యేకత.

అయితే ఈ ఫోన్‌ ధర రూ.24000 వరకూ ఉంటుందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నాయి. అయితే అధికారికంగా ధర ఎంత ఉంటుందో? తెలుసుకోవాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..
ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..
ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే
ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..
ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?
భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?
ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?
ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు
11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తోపు హీరోయిన్..
11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తోపు హీరోయిన్..
బంగారం, వెండి కొనాలనుకుంటే ఇదే రైట్‌ టైమ్‌!
బంగారం, వెండి కొనాలనుకుంటే ఇదే రైట్‌ టైమ్‌!
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..