Vivo Y100i Power 5G: వివో నుంచి సరికొత్త 5జీ ఫోన్.. ఫీచర్స్ చూస్తే వావ్ అనాల్సిందే..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ఓ సరికొత్త ఉత్పత్తిని లాంచ్ చేసింది. వై100 సిరీస్ కి కొనసాగింపుగా వివో వై100ఐ(Vivo Y100i) పవర్ 5జీ పేరుతో చైనాలో ఆవిష్కరించింది. ఇవి మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీనిలో 12జీబీ ర్యామ్ తో పాటు స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1ఎస్ఓసీపై నడుస్తుంది. 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ఓ సరికొత్త ఉత్పత్తిని లాంచ్ చేసింది. వై100 సిరీస్ కి కొనసాగింపుగా వివో వై100ఐ(Vivo Y100i) పవర్ 5జీ పేరుతో చైనాలో ఆవిష్కరించింది. ఇవి మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీనిలో 12జీబీ ర్యామ్ తో పాటు స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1ఎస్ఓసీపై నడుస్తుంది. 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇంకా ఈ వివో 5జీ ఫోన్ కు సంబంధించిన పూర్తి సమాచారం వివరంగా తెలుసుకుందాం..
వివో వై100ఐ పవర్ 5జీ ధర..
వివో వై100ఐ పవర్ 5జీ ఫోన్ 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,099 అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 20,000గా ఉంటుంది. ఇది ప్రస్తుతం చైనాలో వివో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయాలు జరుపుతోంది. మన దేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో కంపెనీ ఇంకా ప్రకటించలేదు. గత నెలలో వివో వై100ఐ పేరిట 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్తో వచ్చిన ఫోన్ CNY 1,599 (మన కరెన్సీలో దాదాపు రూ. 15,000) ధర ట్యాగ్‌తో ప్రారంభమైంది. అలాగే వివో వై100 ఫోన్ మన దేశంలో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది.
వివో వై100ఐ పవర్ 5జీ స్పెసిఫికేషన్స్..
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13, ఆరిజన్ ఓఎస్3 ఆధారంగా పనిచేస్తుంది. ఇది 6.64-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్(1,080×2,388 పిక్సెల్‌లు) స్క్రీన్‌తో గరిష్టంగా 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 91.6 స్క్రీన్-టు-బాడీ రేషియోని కలిగి ఉంది. స్క్రీన్ ఎస్జీఎస్ తక్కువ బ్లూ లైట్ వచ్చేలా చేస్తుంది. ఎల్సీడీ డిస్ ప్లే పై సెల్ఫీ కోసం ప్రత్యేకమైన ఏర్పాటు ఉంచారు. ఆక్టా-కోర్ 4ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ఎస్ఓసీ, 12జీబీ ర్యామ్ అడ్రినో 710 జీపీయూ వస్తుంది. వివో థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం పరికరంలో 639ఎంఎం స్క్వేర్ లిక్విడ్ కూలింగ్ హీట్ పైపు, 8736ఎం గ్రాఫైట్ షీట్‌ను ఫోన్‌కు అమర్చారు.
వివో వై100ఐ పవర్ 5జీ కెమెరా..
ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 10x డిజిటల్ జూమ్ సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2-మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఇక కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. బ్లూటూత్ 5.1, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్, గ్లోనాస్, గెలిలియో, క్యూజెడ్ఎస్ఎస్, ఓటీజీ వైఫై వంటివి ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, సామీప్య సెన్సార్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో 44వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..