Panic Switch: ప్రయాణికుల భద్రతకు రైల్వే శాఖ కీలక చర్యలు.. ఇకపై రైల్వే స్టేషన్స్‌లో ప్రత్యేక స్విచ్..
జాతీయ రవాణా సంస్థ పలు స్టేషన్లలో పానిక్ బటన్లను అమర్చేందుకు ప్రణాళికను రూపొందించింది. ఈ మేరకు సెంట్రల్ రైల్వేకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి పానిక్ బటన్ల ఉపయోగాలను వెల్లడించారు. సెంట్రల్ రైల్వే తన నెట్‌వర్క్‌లోని వివిధ స్టేషన్లలో పానిక్ స్విచ్‌లను ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది. పానిక్ స్విచ్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి మొత్తం 117 స్టేషన్‌లు ఎంపిక చేసింది.

భారతదేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లను పునరుద్ధరణ వేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి భారతీయ రైల్వే శాఖ ప్రత్యేక చర్యలను తీసుకుంటుంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పాటు అత్యంత వేగవంతమైన రైళ్లను నిర్ధారించడంతో పాటు, రైల్వేలు ప్రయాణికుల భద్రతపై కూడా దృష్టి సారిస్తున్నాయి. దానికి అనుగుణంగా జాతీయ రవాణా సంస్థ పలు స్టేషన్లలో పానిక్ బటన్లను అమర్చేందుకు ప్రణాళికను రూపొందించింది. ఈ మేరకు సెంట్రల్ రైల్వేకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి పానిక్ బటన్ల ఉపయోగాలను వెల్లడించారు. సెంట్రల్ రైల్వే తన నెట్‌వర్క్‌లోని వివిధ స్టేషన్లలో పానిక్ స్విచ్‌లను ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది. పానిక్ స్విచ్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి మొత్తం 117 స్టేషన్‌లు ఎంపిక చేసింది. ఇది సమస్యాత్మక సమయాల్లో ప్రజలకు సహాయపడేందుకు రూపొందించారు.
పానిక్ బటన్ అంటే?
అత్యవసర పరిస్థితుల్లో తరచుగా ఉపయోగించే భద్రతా పరికరాలలో పానిక్ బటన్ లేదా స్విచ్ ఒకటి. అటువంటి స్విచ్ ప్రజలు అత్యవసర సమయంలో సహాయం కోరేందుకు అనుమతిస్తుంది. రైల్వే స్టేషన్లలో పానిక్ బటన్ ప్రయాణికులు అపూర్వమైన పరిస్థితి గురించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) సిబ్బందిని అప్రమత్తం చేయడానికి అనుమతిస్తుంది. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణీకులు ఆర్‌పీఎఫ్ నుంచి సహాయం కోసం స్టేషన్‌లలో అమర్చిన స్విచ్‌లను ఉపయోగించవచ్చు.
స్విచ్ పని చేస్తుందిలా
స్విచ్‌లను నొక్కిన తర్వాత ఆర్‌పీఎఫ్ కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ వెళ్తుంది. , తద్వారా అవసరమైన వారికి త్వరగా మద్దతు ఇవ్వడానికి వీలు కల్పిస్తుంది. సీసీటీవీలను పరిశీలించి అవసరమైన వారిని గుర్తిస్తారు. ఈ స్విచ్‌ల ఇన్‌స్టాలేషన్ కూడా ఏడాదిలోపు పూర్తవుతుందని భావిస్తున్నారు. స్విచ్‌లను ఇన్‌స్టాల్ చేసేందుకు సెంట్రల్ రైల్వే రైల్‌టెల్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది.
లోకల్ ట్రైన్స్‌లో సీసీ కెమెరాలు?
రైల్వే స్టేషన్‌లలోని ప్యానిక్ బటన్‌లతో పాటు సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబైలోని లోకల్ రైళ్లలో అన్ని మహిళల కోచ్‌లలో అత్యవసర టాక్‌బ్యాక్ సిస్టమ్, సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తుందని ఆ ఉన్నతాధికారి పేర్కొన్నారు. సేఫ్టీ గేర్‌ల ఇన్‌స్టాలేషన్ మార్చి 2024 నాటికి పూర్తవుతుంది. 771 మహిళా కోచ్‌లలో, 421 ఇప్పటికే సీసీ కెమెరాలు ఉన్నాయి. 512 ఎమర్జెన్సీ టాక్‌బ్యాక్ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి. ముంబై నెట్‌వర్క్‌లో సెంట్రల్ రైల్వే దాదాపు 1850 సబర్బన్ సర్వీసులను, 145 డెము-మెము రైళ్లను నడుపుతోంది. రైల్వే ఐదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సహా 371 మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా నిర్వహిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి