Charging Bulbs: కరెంట్ లేకపోయినా పనిచేసే బల్బ్స్.. తక్కువ ధరలోనే..
సాధారణంగా కరెంట్ లేని సమయంలో ఇంట్లో ఏదైనా లైట్ వెలగాలంటే కచ్చితంగా బ్యాటరీ, ఇన్వర్టర్లు ఉండాల్సిందే. ఇది చాలా ధరతో కూడుకున్న విషయం. అందుకే ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకోవడానికి చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. అయితే ఎలాంటి బ్యాటరీలు లేకుండా, కరెంట్ లేని సమయంలో వెలిగే బల్బ్స్ అందుబాటులో ఉన్నాయి. అది కూడా తక్కువ ధరలోనే. అలాంటి కొన్ని బల్బుల వివరాలు మీకోసం..
Updated on: Dec 28, 2023 | 6:17 PM

Bajaj 9W B22 LED: బజాజ్ 9 వాట్స్ ఎల్‌ఈడీ బల్బ్ రెండేళ్ల వారంటీతో వస్తుంది. 25000 గంటల లైఫ్ స్పాన్‌తో ఈ బల్బ్ పనిచేస్తుంది. ధర విషయానికొస్తే ఈ ఇన్వర్టర్ బల్బ్ అమెజాన్‌లో రూ. 140కి అందుబాటులో ఉంది.

Halonix Prime 12W B22D: హాలోనిక్స్ కంపెనీకి చెందిన ఈ బల్బ్ 12 వాట్స్‌తో పని చేస్తుంది. ఈ బల్బ్ 4 గంటలు బ్యాకప్‌తో పనిచేస్తుంది. ఇందులో పవర్‌ఫుల్ లిథియం బ్యాటరీని అందించారు. ఆరు నెలల వారంటీతో వచ్చే ఈ బల్బ్ అసలు ధర రూ. 599 కాగా, అమెజాన్‌లో రూ. 399కి సొంతం చేసుకోవచ్చు.

Havells Led 12W Option Bulb B22D Cdl: హావెల్స్ కంపెనీకి చెందిన ఈ ఎల్‌ఈడీ బల్ట్ ఇన్వర్టర్‌గా ఉపయోగపడుతుంది. 12 వాట్స్ పవర్‌తో పనిచేసే ఈ బల్బ్ అసలు ధర రూ. 649కాగా అమెజాన్‌లో ఆఫర్‌లో భాగంగా రూ. 399కే అందుబాటులో ఉంది.

Wipro Garnet Base B22 15 - W LED Bulb: విప్రో కంపెనీకి చెందినీ ఇన్వర్టర్ బల్బ్ అసలు ధర రూ. 850 కాగా, అమెజాన్‌లో 51 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 420కే సొంతం చేసుకోవచ్చు. 15 వాట్స్‌తో పనిచేసే ఈ బల్బును చాలా ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

PHILIPS 12W b22d LED Crystal White Bulb: తక్కువ ధరలో మంచి ఎల్‌ఈడీ ఇన్వర్టర్ బల్బ్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ బల్బ్ అసలు ధర రూ. 280కాగా అమెజాన్‌లో ఆఫర్‌లో భాగంగా రూ. 125కే సొంతం చేసుకోవచ్చు. ఒక ఏడాది వారంటీతో వచ్చే బల్బ్ 4 గంటల బ్యాకప్ ఇస్తుంది.





























