- Telugu News Photo Gallery Technology photos Whatsapp introducing new features now users can share status through whatsapp web also
WhatsApp: వాట్సాప్‌లో ఆ ఫీచర్ వచ్చేస్తోంది.. ఇకపై వాట్సాప్ వెబ్‌లోనూ..
యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేయడం మెసేజింగ్ యాప్ వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ మొదటి స్థానంలో ఉండడమే దీనికి కారణం. ఈ క్రమంలోనే తాజాగా యూజర్ల కోసం మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్. ఇంతకీ ఏంటా ఫీచర్.? దీంతో ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 27, 2023 | 10:19 PM

ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇప్పటి వరకు కేవలం మొబైల్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే వాట్సాప్ వెబ్‌లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

సాధారణంగా వాట్సాప్‌లో స్టేటస్ షేరింగ్ ఆప్షన్ కేవలం స్మార్ట్ ఫోన్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫీచర్‌ను వాట్సాప్ వెబ్‌లోనూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

అంటే ఈ కొత్త ఫీచర్ సహాయంతో ఇకపై యూజర్లు డెస్క్ టాప్ నుంచి కూడా ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్‌లను వాట్సాప్ స్టేటస్‌లుగా షేర్ చేయొచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

అయితే వాట్సాప్ తీసుకురానున్న ఈ ఫీచర్ ద్వారా వెబ్ వెర్షన్ నుంచి లేదా లింక్ చేయబడిన 'కంపానియన్' నుండి స్టేటస్ పెట్టవచ్చు. టెస్టింగ్ స్టేజ్‌లో భాగంగా ప్రస్తుతం.. ఈ ఫీచర్ బీటా 2.2353.59 వెర్షన్ యూజర్లకు అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం విడుదల చేశారు.

ఇక వెబ్ నుంచి స్టేటస్ అప్‌డేట్‌లు చేసినప్పుడు దానిలో కంటెంట్ మొత్తం ఎండ్-టు-ఎండ్ ప్రొటెక్షన్ లభిస్తుందని వాట్సాప్ చెబుతోంది. ఈ కొత్త ఫీచర్‌ను ఒదట ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత మిగతా యూజర్లకు విడుదల చేయనున్నారు.





























