Tiktok: భారత్‌లో నిషేధంలో ఉన్నా జోరు తగ్గని టిక్‌టాక్.. ఫేస్‌బుక్‌ను వెనక్కి నెట్టి మరీ, కొత్త రికార్డు..
Facebook Tiktok: టిక్‌టాక్ యాప్ ఓ సంచలనంగా దూసుకొచ్చింది. ప్రతిభ ఉండి, ఆ ప్రతిభను ఎక్కడ ప్రదర్శించాలో తెలియక ఆలోచనలో పడ్డ ఎంతో మందికి టిక్‌టాక్ ఓ వేదికగా మారింది. కోట్లలో...
Facebook Tiktok: టిక్‌టాక్ యాప్ ఓ సంచలనంగా దూసుకొచ్చింది. ప్రతిభ ఉండి, ఆ ప్రతిభను ఎక్కడ ప్రదర్శించాలో తెలియక ఆలోచనలో పడ్డ ఎంతో మందికి టిక్‌టాక్ ఓ వేదికగా మారింది. కోట్లలో డౌన్‌లోడ్‌లతో టిక్‌టాక్ టాప్ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో ఈ యాప్‌కు విపరీతమైన క్రేజ్ దక్కింది. చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ అనే సంస్థ రూపొందించిన ఈ యాప్ ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. అయితే ఈ యాప్ కొన్ని దేశాల్లో మాత్రం నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 130కిపైగా కోట్ల జనాభా ఉన్న భారత్‌లో నిషేధానికి గురికావడం టిక్‌టాక్‌కు నిజంగానే ఎదురుదెబ్బగా భావించారు. కానీ ఈ యాప్ దూకుడు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. భారత్‌తో పాటు మరికొన్ని దేశాల్లో నిషేధానికి గురైనప్పటికీ టిక్‌టాక్ తాజాగా ఓ సరికొత్త రికార్డును తిరగరాసింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న ఫేస్‌బుక్‌ను వెనక్కినెట్టి మరీ టిక్‌టాక్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. 2020లో అత్యధిక యూజర్లు డౌన్‌లోడ్ చేసిన యాప్‌గా టిక్‌టాక్ మొదటి స్థానంలో నిలిచినట్లు.. నిక్కీ ఏషియా అనే బిజినెస్ జర్నల్ వెల్లడించింది. బైట్‌డ్యాన్స్ తన మార్కెట్‌ను విస్తరిస్తూ వెళ్లడమే దీనికి కారణమని నిక్సీ ఏషియా తెలిపింది. 2019లో అత్యధిక డౌన్‌లోడ్స్ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన టిక్‌టాక్ ఏడాదిలోనే మొదటి స్థానంలోకి చేరడం విశేషం. ఇదిలా ఉంటే టిక్‌టాక్ మళ్లీ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. పేరు మార్చుకొని టిక్‌టాక్ మళ్లీ వస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఒకవేళ టిక్‌టాక్‌కు భారత్‌లో మళ్లీ అనుమతులు వస్తే డౌన్‌లోడ్‌ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిక్కీ ఏషియా తెలిపింది.
Crime News: పోలీస్ ఎగ్జామ్ పేపర్ లీక్.. హర్యానాలో తీగ లాగితే, హైదరాబాద్‌లో కదిలిన డొంక