Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: ఇకపై అంతరిక్షంలో దర్శనమివ్వనున్న ప్రకటనల బోర్డులు.. మరో అద్భుతానికి తెరతీస్తోన్న ఎలాన్‌ మస్క్‌.

Elon Musk: ఒకప్పుడు ఏదైనా వస్తువుకు సంబంధించి ఓ ప్రకటన ఇవ్వాలంటే గోడలపై పెయింట్‌ రూపంలో వేసేవారు. అనంతరం న్యూస్‌ పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం, కరపత్రాలు పంచడం లాంటివి..

Elon Musk: ఇకపై అంతరిక్షంలో దర్శనమివ్వనున్న ప్రకటనల బోర్డులు.. మరో అద్భుతానికి తెరతీస్తోన్న ఎలాన్‌ మస్క్‌.
Elon Musk
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 11, 2021 | 5:55 PM

Elon Musk: ఒకప్పుడు ఏదైనా వస్తువుకు సంబంధించి ఓ ప్రకటన ఇవ్వాలంటే గోడలపై పెయింట్‌ రూపంలో వేసేవారు. అనంతరం న్యూస్‌ పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం, కరపత్రాలు పంచడం లాంటివి చేశారు. తర్వాత రోడ్లపై పెద్ద పెద్ద హోర్డింగ్స్‌ పెడుతూ ప్రచారం చేసుకున్నారు. ఇక తాజాగా డిజిటల్‌ మార్కెటింగ్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో ప్రకటనలు ఇస్తున్నారు. టార్గెటెడ్‌ ఆడియన్స్‌కు తమ ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనలు ఇచ్చేస్తున్నాయి సంస్థలు. అయితే ఇంతలా మార్పులకు లోనవుతూ వస్తోన్న ప్రకటనల తీరు ఇప్పుడు మరో కొత్త రూపాన్ని సంతరించుకోనుంది.

ఇప్పటి వరకు భూమిపై పరిమితమైన యాడ్స్‌.. ఇకపై అంతరిక్షంలోనూ దర్శనమివ్వనున్నాయి. ప్రముఖ బిజినెస్‌ మ్యాన్‌ ఎలాన్‌ మస్క్‌ దీన్ని సాకారం చేసే పనిలో పడ్డారు. ఎలాన్‌ మస్క్‌ స్థాపించిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కెనాడాకు చెందిన స్టార్టప్‌ జియోమెట్రిక్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ (జీఈసీ) భాగస్వామ్యంతో క్యూబ్‌శాట్‌ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఈ శాటిలైట్‌ సహాయంతో కంపెనీల ప్రకటనలు అంతరిక్షంలో బిల్‌బోర్డ్స్‌పై ప్రదర్శించనుంది. మరి అంతరిక్షంలో వేసిన ప్రకటనను అక్కడ ఎవరు చూస్తారనేగా మీ సందేహం. ఇందుకోసం ఈ సంస్థ సదరు ప్రకటనలను యూట్యూబ్‌లో ప్రత్యక్షప్రసారం చేయనుంది. ఇందుకోసం క్యూబ్‌సాట్‌కు ఓ సెల్ఫీ స్టిక్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇలా అంతరిక్షంలో ప్రచారం చేయడం వల్ల సదరు ప్రొడెక్ట్‌కు ఎక్కడలేని క్రేజ్‌ వస్తుందనేది నిర్వాహకుల ఉద్దేశం. ఈ విషయమై జీఈసీ స్టార్టప్‌ కంపెనీ సీఈవో శామ్యూల్ రీడ్ మాట్లాడుతూ.. అంతరిక్షంలో ప్రకటనలు ఇవ్వాలనుకునే వారు డాగీకాయిన్‌ క్రిప్టోకరెన్సీ ఉపయోగించుకోవచ్చని తెలిపారు. క్యూబ్‌శాట్‌ ఉపగ్రహంతో ప్రకటనల రంగంలో పెనుమార్పులు రానున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: Tiktok: భారత్‌లో నిషేధంలో ఉన్నా జోరు తగ్గని టిక్‌టాక్‌.. ఫేస్‌బుక్‌ను వెనక్కి నెట్టి మరీ, కొత్త రికార్డు..

Xiaomi CyberDog: మరో అద్భుతాన్ని ఆవిష్కరించిన షియోమీ.. ఇంటి పనుల్లో సహాయం చేసే సైబర్‌ డాగ్‌ రూపకల్పన.

GSLV: జీఎస్ఎల్వీ కౌంట్ డౌన్ ప్రారంభం.. దేశ రక్షణ వ్యవస్థకు, విపత్తుల నిర్వహణకు ఉపకరించనున్న శాటిలైట్