VI Prepaid Plan: మరో ఆదాయ మార్గాన్ని ఎంచుకున్న వీఐ.. మిస్డ్ కాల్స్ అలెర్ట్స్‌కు కూడా ప్రత్యేక ప్లాన్ రిలీజ్..
తాజాగా టెలికాం రంగంలోనే ఇటీవల కాలంలో లేని విధంగా వీఐ ఓ కొత్త ఆదాయ మార్గాన్ని ఎంచుకుంది. వినియోగదారులకు ఇకపై మిస్డ్ కాల్ అలెర్ట్స్ అందించాలంటే కచ్చితంగా ప్రత్యేక రీచార్జ్ చేయించుకోవాల్సిందే అని స్పష్టం చేసింది.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం అనేది ఓ ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా టెలికాం రంగంలోకి జియో రాకంతో ఓ సంచలనం ప్రారంభం అయ్యింది. జియో ప్రారంభంలో 4 జీ సర్వీసులను తక్కువ ధరకే ఇవ్వడంతో వినియోగదారులు ఎక్కువ మంది జియోకే ఓటేశారు. దీంతో ఇతర కంపెనీలు కూడా తక్కువ ధరకే ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఒడిదుడుకుల మధ్య కంపెనీల ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో విడివిడిగా ఉన్న వోడాఫోన్, ఐడియా రెండూ కూడా కలిసిపోయి ఏక నెట్‌వర్క్‌గా మారాయి. వీఐ పేరుతో ఒకే కంపెనీగా సర్వీసులను అందిస్తున్నాయి. తక్కువ ధరకే సర్వీసులను అందిస్తుండడంతో కంపెనీలు ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయాయి. తాజాగా టెలికాం రంగంలోనే ఇటీవల కాలంలో లేని విధంగా వీఐ ఓ కొత్త ఆదాయ మార్గాన్ని ఎంచుకుంది. వినియోగదారులకు ఇకపై మిస్డ్ కాల్ అలెర్ట్స్ అందించాలంటే కచ్చితంగా ప్రత్యేక రీచార్జ్ చేయించుకోవాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్ని రూపాయలతో కొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది? ఈ ప్లాన్‌లో వీఐ కంపెనీ ఎలాంటి సేవలను అందిస్తుందో? ఓ సారి తెలుసుకుందాం.
ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా లేకపోతే ఏదైనా సిగ్నల్ లేని ప్రాంతాలకు తప్పనిసరై వెళ్లాల్సి వచ్చిన సమయంలో మనకు ఎవరైనా ఫోన్ చేశారో? లేదో? అనే అనుమానం పీకుతూ ఉంటుంది. కాబట్టి మన ఫోన్ ఆన్ చేయగానే లేకపోతే సిగ్నల్ రాగానే మిస్డ్ కాల్ అలెర్ట్ ద్వారా కంపెనీలు మనకు ఎవరైతే ఫోన్ చేశారో? ఏ సమయంలో ఫోన్ చేశారో? వంటి వివరాలను తెలుపుతూ మెసేజ్ పంపుతాయి. అలాగే మనకు ఫోన్ చేసిన వారికి మన ఫోన్ ఆన్ చేశామని లేదా సిగ్నల్స్ వచ్చాయని వివరాలతో సందేశం పంపుతాయి. తద్వారా మన కమ్యూనికేషన్ విషయంలో మిస్డ్ కాల్ అలెర్ట్‌లు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే ఈ సర్వీసులను అన్‌లిమిటెడ్ ప్యాక్స్‌తో ఉచితంగానే అందిస్తున్నాయి. తాజాగా వీఐ మాత్రం మిస్డ్ కాల్ అలర్ట్‌ను వ్యాల్యూ యాడెడ్ సర్వీస్‌గా పేర్కొంటూ కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం రూ.45తో 180 రోజులు చెల్లుబాటు అయ్యేలా మిస్డ్ కాల్ హెచ్చరికల అదనపు ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ వీఐ తన వెబ్‌సైట్ ద్వారా ఇప్పటికే పేర్కొంది. ఈ మిస్డ్ కాల్ హెచ్చరికల అదనపు ఫీచర్ వినియోగదారులకు మెరుగైన సౌకర్యాన్ని అందిస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..