ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఐటెల్ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఐటెల్ ఎస్ 23 పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్‌లో యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది. ర్యామ్‌ను స్టోరేజ్ నుంచి వర్చువల్‌గా మరో 8 జీబీ పెంచుకోవచ్చు.