Aadhar Mitra: యూఐడీఏఐ సరికొత్త చాట్‌బాట్.. ఆధార్ సమస్యలు తెలపడం మరింత సులభం
యూఐడీఏఐ కూడా ఆధార్ సేవలను సులభతరం చేసింది. ప్రస్తుతం యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో ఆధార్ మిత్ర అనే చాట్‌బాట్‌తో సేవలను అందిస్తుంది. ఆధార్ మిత్ర ద్వారా భారత పౌరులు పొందే సేవలను ఓ సారి తెలుసుకుందాం.

ప్రస్తుతం ఓపెన్ ఏఐకు చెందిన చాట్ జీపీటీ విజయంతో మళ్లీ చాట్‌బాట్‌లపై ఆసక్తి పెరుగుతుంది. యూజర్లు అడిగిన సమాచారాన్ని వెంటనే వారికి అందించడంతో పాటు ముఖ్యంగా నిరక్షరాస్యులకు కూడా అర్థమయ్యేలా సమాచారం అందించడం చాట్‌బాట్‌ల ప్రధాన కర్తవ్యం. అయితే భారతదేశంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసే ఆధార్ బాగా ప్రాచుర్యం పొందింది. ప్రతి చిన్న అవసరానికి గుర్తింపు కార్డుగా ఆధార్ అడుగుతున్నారు. అలాగే సంక్షేమ పథకాల అమలు ఆధార్ ప్రామణికంగా తీసుకుంటారు. దీంతో ఆధార్ ప్రతిఒక్కరికీ తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ కూడా ఆధార్ సేవలను సులభతరం చేసింది. ప్రస్తుతం యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో ఆధార్ మిత్ర అనే చాట్‌బాట్‌తో సేవలను అందిస్తుంది. ఆధార్ మిత్ర ద్వారా భారత పౌరులు పొందే సేవలను ఓ సారి తెలుసుకుందాం.
ఆధార్ కార్డు జారీ, స్థితి ఇతర అవసరాలకు వినియోగదారులకు సమాధానం ఇవ్వడానికి ఆధార్ మిత్ర చాట్‌బాట్‌ను రూపొందించారు. ఆధార్ మిత్ర యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఏఐఎంఎల్ టెక్నాలజీతో రూపొందించారు. యూజర్లకు ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వడానికి దీన్ని డిజైన్ చేశారు. ఆధార్ నమోద సంఖ్య, పీవీసీ కార్డు స్థితి, ఫిర్యాదు స్థితి ఇతర విషయాలు అందుబాటులో ఉంటాయి. ఇంగ్లిష్, హిందీ భాషల్లో అందుబాటలో ఉంటుంది. ఆధార్ తనిఖీ, నవీకరణ స్థితి, దగ్గరలోని ఆధార్ కేంద్రం, వీడియో ఫ్రేమ్ ఇంటిగ్రేషన్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు.
ఉపయోగించడం ఇలా
ముందుగా యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ ఇంగ్లిష్ లేదా ఇతర భాష ఆప్షన్లు ఎంచుకోవాలి. కుడివైపున కనిపించే ఆధార్ మిత్ర చాట్‌బాట్‌ను క్లిక్ చేయాలి. తమ ప్రశ్నలను అక్కడ ఎంటర్ చేసి సమాధానం పొందవచ్చు. లేదా ప్రశ్నలకు సంబంధించిన వీడియోలు లింక్‌లు డిస్‌ప్లే అవుతాయి. అక్కడ సంబంధిత వీడియోలను వీక్షించవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..