smartphone: మీ ఫోన్ బ్యాటరీ హెల్తీగా ఉండాలా.? 80-20 ఫార్ములాను పాటించండి..
అయితే స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్మార్ట్‌ఫోన్ విషయంలో జాగ్రత్త పడాల్సింది బ్యాటరీ గురించి. బ్యాటరీ విషయంలో చేసే కొన్ని తప్పులు బ్యాటరీ లైఫ్‌ను పాడు చేస్తాయి. అయితే ఫోన్ బ్యాటరీ బాగుండాలంటే 80-20 నియమాన్ని పాటించాలని టెక్ నిపుణులు చెబుతున్నారు...
ప్రస్తుతం చేతిలో స్మార్ట్ ఫోన్ లేని వారిని బూతద్ధంలో వేసి వెతికినా కనిపించని పరిస్థితి ఉంది. స్కూల్‌కి వెళ్లే చిన్నారుల నుంచి రిటైర్ అయిన ఉద్యోగి వరకు ప్రతీ ఒక్కరూ ఫోన్‌ను ఉపయోగించాల్సిందే. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతీ చిన్న అవసరానికి ఫోన్ ఉండాల్సిందే. అయితే స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్మార్ట్‌ఫోన్ విషయంలో జాగ్రత్త పడాల్సింది బ్యాటరీ గురించి. బ్యాటరీ విషయంలో చేసే కొన్ని తప్పులు బ్యాటరీ లైఫ్‌ను పాడు చేస్తాయి. అయితే ఫోన్ బ్యాటరీ బాగుండాలంటే 80-20 నియమాన్ని పాటించాలని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ నియమం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మనలో చాలా మంది స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి మర్చిపోతుంటారు. కొందరైతే రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్‌లోనే ఉంచుతారు. ఇలా చేయడం బ్యాటరీకి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 100 శాతం అయ్యే వరకు అలాగే ఉంచాలనే భావనలో ఉంటారు. అయితే ఇది మంచిది కాదు. ఫోన్‌ను ఎట్టి పరిస్థితుల్లో 80 నుంచి 90 శాతం మధ్యలో మాత్రమే ఛార్జ్ అయ్యేలా చూసుకోవాలి. 100 శాతం ఛార్జ్ అయ్యే వరకు చూడకూడదు.
ఒక ఫోన్‌కు ఎప్పుడు ఛార్జింగ్ పెట్టాలనే విషయంపై కూడా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు అంటున్నారు. సాధారణంగా మనలో చాలా మంది కొంచెం ఛార్జింగ్ తగ్గగానే మళ్లీ ఛార్జ్ చేస్తుంటారు. 50 శాతం ఉన్నా మళ్లీ మళ్లీ ఛార్జింగ్ పెడుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ పాడయ్యే ప్రమాదం ఉంటుంది. బ్యాటరీ ఉబ్బడానికి ఇదొక కారణంగా చెప్పొచ్చు. అలా అని ఛార్జింగ్ పూర్తిగా అయిపోయేంత వరకు కూడా ఉంచకూడదని చెబుతున్నారు.
ఫోన్ బ్యాటరీ జీరో అయ్యే వరకు అస్సలు చూడకూడదు. బ్యాటరీ 20 శాతానికి చేరుకున్న వెంటనే ఛార్జింగ్ చేయాలి. ఇలా బ్యాటరీ ఛార్జింగ్ 80కి మించకుండా, 20కి తగ్గకుండా ఛార్జింగ్ చేస్తుండాలి. ఈ సింపుల్ టిప్‌ను పాటించడం వల్ల మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటుంది. బ్యాటరీ ఉబ్బడం, త్వరగా ఛార్జింగ్ డిస్‌ఛార్జ్ కావడం లాంటి సమస్యలు ఉండవు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..