Sim cards: మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయ్? అతిగా ఉంటే అనర్థమే! ఇప్పుడే తనిఖీ చేసుకోండి..

మీ పేరుతో అనేక సిమ్ కార్డులు తీసుకోవడం వలన ఇబ్బందుల్లో పడవచ్చు. టెలికాం చట్టంలో పేర్కొన్న దానికంటే ఎక్కువగా తీసుకుంటే భారీ జరిమానా చెల్లించాలి. పదేపదే నిబంధనను ఉల్లంఘిస్తే జైలుకు కూడా వెళ్లాల్ని రావచ్చు. జమ్మూ కశ్మీర్, అసోం, ఈశాన్య లైసెన్సుడ్ సర్వీస్ ఏరియాలు (ఎల్ఎస్ఏలు)లలో ఒక వ్యక్తి ఆరు సిమ్ లు, మిగిలిన రాష్ట్రాలలో తొమ్మిది వరకూ తీసుకునే వీలు ఉంది.

Sim cards: మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులున్నాయ్? అతిగా ఉంటే అనర్థమే! ఇప్పుడే తనిఖీ చేసుకోండి..
Sim Card
Follow us

|

Updated on: Jul 07, 2024 | 4:47 PM

ఫోన్ పనిచేయడానికి సిమ్ కార్డు చాలా అవసరం. ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ తమ పేరు మీద వీటిని తీసుకుంటారు. వివిధ టెలికాం కంపెనీలు సిమ్ కార్డులపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి విక్రయిస్తుంటాయి. ఫోన్లలో కూడా డబుల్ సిమ్ లు వాడుకునే వీలు ఉండడంతో అందరూ ఒకటి కన్నా ఎక్కువ సిమ్ కార్డులు తీసుకుంటున్నారు. అయితే మనం ఇష్టవచ్చినన్ని సిమ్ లు కొనుగోలు చేయడానికి అవకాశం లేదు. దానికి కూడా పరిమితి ఉంది. అది దాటితే జరిమానాతో పాటు, జైలు శిక్ష విధిస్తారు.

నిబంధనలు..

మీ పేరుతో అనేక సిమ్ కార్డులు తీసుకోవడం వలన ఇబ్బందుల్లో పడవచ్చు. టెలికాం చట్టంలో పేర్కొన్న దానికంటే ఎక్కువగా తీసుకుంటే భారీ జరిమానా చెల్లించాలి. పదేపదే నిబంధనను ఉల్లంఘిస్తే జైలుకు కూడా వెళ్లాల్ని రావచ్చు. జమ్మూ కశ్మీర్, అసోం, ఈశాన్య లైసెన్సుడ్ సర్వీస్ ఏరియాలు (ఎల్ఎస్ఏలు)లలో ఒక వ్యక్తి ఆరు సిమ్ లు, మిగిలిన రాష్ట్రాలలో తొమ్మిది వరకూ తీసుకునే వీలు ఉంది.

కఠిన చర్యలు..

నిర్దేశిత సంఖ్య కంటే ఎక్కువ సిమ్ కార్డులు తీసుకుంటే జరిమానా చెల్లించాలి. మొదటి సారి నేరానికి రూ. 50 వేలు విధిస్తారు. ఇది ఒక్కొక్కరికి రూ. 2 లక్షల వరకూ ఉంటుంది. సాధారణంగా పరిమితికి మించి ఎక్కువ సిమ్ లు ఉంటే జరిమానా, జైలు శిక్ష విధించడానికి నిర్దిష్ట నిబంధన లేదు. అవసరమైతే వాటిని డిస్‌ కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ మోసం పూరితంగా సిమ్ కార్డులను పొంది, వినియోగిస్తుంటే కఠిన చర్యలు తీసుకుంటారు.

మీరే బాధ్యులు..

ఏది ఏమైనా మీపేరుపై పరిమితికి మించి సిమ్ లు ఉంటే మీరే జవాబుదారీగా ఉండాలి. ఒకవేళ మీరు కేవలం రెండు లేదా మూడు సిమ్ లు మాత్రమే వినియోగిస్తూ ఉండవచ్చు. కానీ మీ పేరు మీద వేరే వాళ్లు కూడా వాడుతూ ఉండే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఈ తరహా ఘటనలు కూాడా జరుగతున్నాయి. సిమ్ తీసుకున్నప్పుడు మనమిచ్చే గుర్తింపు పత్రాలను ఉపయోగించి, మరొకరు సిమ్ లు తీసుకుంటున్నారు.

పరిశీలన..

ఎవరైనా మీ పేరుతో సిమ్ కార్డులను తీసుకుని, వాటిని మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పేరు మీదు ఎన్ని సిమ్ లు ఉన్నాయో పరిశీలించుకోవడం చాలా అవసరం. దానికి కోసం ఈ కింద పద్ధతులు పాటిస్తే చాలు. సంచార్ సాథీ అనే ప్రత్యేక పోర్టల్‌ ద్వారా చాలా సులభంగా తనిఖీ చేసుకోవచ్చు.

  • వెబ్ సైట్లోకి వెళ్లండి.
  • నిర్దేశించిన కాలమ్‌లో మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆపై క్యాప్చాలో టైప్ చేయండి. పూర్తి చేసిన తర్వాత ‘వాలిడేట్ క్యాప్చా’పై క్లిక్ చేయాలి.
  • క్యాప్చాను ధ్రువీకరించిన తర్వాత ఓటీపీ వస్తుంది. దానిని నిర్దేశించిన కాలమ్‌లో నమోదు చేయండి.
  • కొత్త వెబ్‌పేజీ తెరుచుకుంటుంది. దానిలో మీ పేరుమీద ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో చూపుతుంది.
  • ఆ పేజీలో మీకు మూడు ఎంపికలు కనిపిస్తాయి. నాట్ మై నంబర్, అవసరం లేదు, అవసరం అనే ఆప్షన్లు ఉంటాయి.
  • మీకు తెలియకుండా మీపేరుపై ఉన్న నంబర్ ను డిస్ కనెక్ట్ చేసుకోవాలి. ఇందుకోసం నాట్ మై నంబర్ ఎంపికపై క్లిక్ చేయాలి.
  • మీరు తీసుకుని, వినియోగించడం మానేసిన నంబర్ ను రద్దు చేసుకోవడం కోసం ’అవసరం లేదు‘ అనే దానిపై క్లిక్ చేయాలి.
  • మీరు వాడుకున్ననంబర్లకు సంబంధించి ’అవసరం‘ అనే ఆప్షన్ పై నొక్కాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..! ఎక్కడో కాదు మన దేశంలోనే
ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..! ఎక్కడో కాదు మన దేశంలోనే
బడ్జెట్ ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్ జోరు.. గత పదేళ్ల రికార్డు
బడ్జెట్ ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్ జోరు.. గత పదేళ్ల రికార్డు
WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
ఈ బడ్జెట్ ఎందుకు ప్రత్యేకం? ఈ రంగాలపై భారీ అంచనాలు..
ఈ బడ్జెట్ ఎందుకు ప్రత్యేకం? ఈ రంగాలపై భారీ అంచనాలు..
ఢిల్లీకి జగన్.. 3 రోజుల పాటు అక్కడే...
ఢిల్లీకి జగన్.. 3 రోజుల పాటు అక్కడే...
సొంతింటి కల నెరవేరేదెలా? గృహ నిర్మాణానికి బడ్జెట్ లో ప్రకటన.?
సొంతింటి కల నెరవేరేదెలా? గృహ నిర్మాణానికి బడ్జెట్ లో ప్రకటన.?
మీక్కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.? ఆశ పడ్డారో అంతే సంగతులు..
మీక్కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.? ఆశ పడ్డారో అంతే సంగతులు..
ఎన్నో ఆశలు.. భారీ అంచనాలు.. కేంద్ర బడ్జెట్‌‌ పై ఉత్కంఠ
ఎన్నో ఆశలు.. భారీ అంచనాలు.. కేంద్ర బడ్జెట్‌‌ పై ఉత్కంఠ
నల్లటి పాలు ఇచ్చే జంతువు ఏదో మీకు తెలుసా..?ఇందులో కొవ్వుశాతం జీరో
నల్లటి పాలు ఇచ్చే జంతువు ఏదో మీకు తెలుసా..?ఇందులో కొవ్వుశాతం జీరో
హైదరాబాదీలకు ఇంట్లో భోజనం కన్నా.. పొరుగు హోటల్ బిర్యానీయే మిన్న!
హైదరాబాదీలకు ఇంట్లో భోజనం కన్నా.. పొరుగు హోటల్ బిర్యానీయే మిన్న!