Moto G85: మోటోరోలా నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. అద్భుతమైన ఫీచర్స్

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా ఇటీవల మార్కెట్లోకి వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఓవైపు ప్రీమియం ఫోన్‌లతో పాటు, మరోవైపు బడ్జెట్‌ ఫోన్‌లను సైతం తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మోటోరోలా కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. మోటో జీ85 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది...

Moto G85: మోటోరోలా నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. అద్భుతమైన ఫీచర్స్
Moto G85
Follow us

|

Updated on: Jul 07, 2024 | 5:24 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా ఇటీవల మార్కెట్లోకి వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఓవైపు ప్రీమియం ఫోన్‌లతో పాటు, మరోవైపు బడ్జెట్‌ ఫోన్‌లను సైతం తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మోటోరోలా కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. మోటో జీ85 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మోటో జీ85 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. గత కొన్ని రోజుల క్రితం చైనాలో ఈ ఫోన్‌ను ఎస్‌50 నియో పేరుతో తీసుకొచ్చారు. తాజాగా భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. జులై 10వ తేదీన ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ 3డీ కర్వ్డ్‌ డిస్‌ప్లేను అందించనున్నారు. 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్‌తో కూడిన పీఓఎల్‌ఈడీ ప్యానెల్‌ను ఇవ్వనున్నారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఇందులో సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ స్కానర్‌ను అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6ఎస్‌ జెన్‌ 3 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను అందించనున్నారు.

ఇక ఈ ఫోన్‌ను 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌తో తీసుకొస్తున్నారు. ఈ ఫోన్‌లో 24 జీబీ వరకు ర్యామ్‌ను ఎక్సపాండ్‌ చేసుకోవచ్చు. అలాగే మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఇంటర్నల్‌ మెమోరీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు, అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ఇందులో 30 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.

ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 5జీ, 4జీ, బ్లూటూత్ 5.1, 5GHz వై-ఫై, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లను అందిచనున్నారు. ఈ ఫోన్‌లో డాల్బీ ఆటమ్స్‌కు సపోర్ట్‌ చేసే డ్యూయల్‌ స్టీరియో స్పీకర్స్‌ను అందించారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ రూ. 18 వేల నుంచి రూ. 20 వేల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫోన్‌కు సంంధించిన పూర్తి వివరాలపై జుల్‌ 10వ తేదీన అధికారిక ప్రకటన రానుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఒకే రాశిలో రవి, శుక్ర గ్రహాలు.. ఈ రాశుల వారికి అధికార,ఆదాయ యోగాలు
ఒకే రాశిలో రవి, శుక్ర గ్రహాలు.. ఈ రాశుల వారికి అధికార,ఆదాయ యోగాలు
IND vs SL: భారత జట్టులోకి ఆరుగురు కేకేఆర్ ప్లేయర్లు..
IND vs SL: భారత జట్టులోకి ఆరుగురు కేకేఆర్ ప్లేయర్లు..
తలకు బలంగా తాకిన బంతి.. కట్ చేస్తే.. మైదానంలో రక్తపుమడుగులో బౌలర్
తలకు బలంగా తాకిన బంతి.. కట్ చేస్తే.. మైదానంలో రక్తపుమడుగులో బౌలర్
వర్షాకాలంలో కాళ్లకు వచ్చే చర్మ సమస్యలకు.. ఈ చిట్కాలతో ఉపశమనం..
వర్షాకాలంలో కాళ్లకు వచ్చే చర్మ సమస్యలకు.. ఈ చిట్కాలతో ఉపశమనం..
కలకలం రేపుతున్న చాందిపుర వైరస్‌.. అక్కడ మరో మరణం..! నిపుణుల సలహా.
కలకలం రేపుతున్న చాందిపుర వైరస్‌.. అక్కడ మరో మరణం..! నిపుణుల సలహా.
ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?
ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?
ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు మించిన ప్రాధాన్యం ఎందుకు?
ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు మించిన ప్రాధాన్యం ఎందుకు?
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌
మీ ఇంటిని ఇలా తుడిచారంటే.. ఆర్థిక కష్టాల నుంచి బయట పడతారు..
మీ ఇంటిని ఇలా తుడిచారంటే.. ఆర్థిక కష్టాల నుంచి బయట పడతారు..
Microsoft: సమస్యను ఎలా పరిష్కరించాలో తెలిపిన కంపెనీ మైక్రోసాఫ్ట్
Microsoft: సమస్యను ఎలా పరిష్కరించాలో తెలిపిన కంపెనీ మైక్రోసాఫ్ట్