AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaming Desktops: గేమింగ్‌ ప్రియులు అదిరిపడే కంప్యూటర్స్‌ ఇవే.. ఫీచర్స్‌ విషయంలో వీటి ఏవీ సాటిరావంతే..!

ఇప్పుడు కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్స్‌ రాకతో శారీరక ఆటలు ఆడేవారు కరువయ్యారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో గేమింగ్‌ ల్యాప్‌టాప్స్‌తో పాటు డెస్క్‌టాప్స్‌పై యువత ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అంటే బోర్‌ కొట్టినప్పుడు రిలాక్సేషన్‌ కోసం కంప్యూటర్‌ గేమ్స్‌ను ఆశ్రయిస్తున్న ప్రస్తుతం తరుణంలో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మంచి గేమింగ్‌ డెస్క్‌టాప్స్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Gaming Desktops: గేమింగ్‌ ప్రియులు అదిరిపడే కంప్యూటర్స్‌ ఇవే.. ఫీచర్స్‌ విషయంలో వీటి ఏవీ సాటిరావంతే..!
Gaming Desktops
Nikhil
| Edited By: Janardhan Veluru|

Updated on: Jan 09, 2024 | 3:59 PM

Share

ఇటీవల కాలంలో కంప్యూటర్‌ వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో వివిధ ఫీచర్లు అందులో రావడంతో యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. గతంలో ఆటలు ఆడడానికి గ్రౌండ్‌కు వెళ్లావారు. ఇప్పుడు కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్స్‌ రాకతో శారీరక ఆటలు ఆడేవారు కరువయ్యారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో గేమింగ్‌ ల్యాప్‌టాప్స్‌తో పాటు డెస్క్‌టాప్స్‌పై యువత ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అంటే బోర్‌ కొట్టినప్పుడు రిలాక్సేషన్‌ కోసం కంప్యూటర్‌ గేమ్స్‌ను ఆశ్రయిస్తున్న ప్రస్తుతం తరుణంలో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మంచి గేమింగ్‌ డెస్క్‌టాప్స్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

జిబ్రానిక్స్‌ ఆర్‌జీబీ

జిబ్రానిక్స్‌ ఆర్‌జీబీ గేమింగ్ డెస్క్‌టాప్ కంప్యూటర్ 16 జీబీ ర్యామ్‌తో గేమర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. ఇంటెల్ కోర్ ఐ5-6500 ప్రాసెసర్‌తో పని చేసే ఈ డెస్క్‌టాప్‌ మల్టీ టాస్కింగ్, గేమింగ్ అనుభవాలను అందిస్తుంది. 480 జీబీ ఎస్‌ఎస్‌డీ+1 టీబీ హెచ్‌డీడీతో కూడిన డ్యూయల్ స్టోరేజ్ సొల్యూషన్ తగినంత స్థలం, శీఘ్ర బూట్ టైమ్‌లను అందిస్తుంది. 4 జీబీ మెమరీతో జీఫోర్స్‌ జీటీఎక్స్‌ 1050 టీఐ గ్రాఫిక్స్ కార్డ్‌ని చేర్చడం అనేది చాలా ఆధునిక గేమ్‌లను సరైన సెట్టింగ్‌లలో నిర్వహించే సామర్థ్యం ఈ డెస్క్‌టాప్‌ సొంతం. ఆర్‌జీబీ కీబోర్డ్, మౌస్ స్టైలిష్ టచ్‌ని జోడిస్తాయి. అలాగే వైఫైతో ఆన్‌లైన్ గేమింగ్ కోసం సౌలభ్యాన్ని అందిస్తుంది. విండోస్‌ 10తో ఈ డెస్క్‌టాప్‌ ధర రూ.69,900గా ఉంది.

ఆసస్‌ రాగ్‌ స్ట్రిక్స్‌

ఆసస్‌ రాగ్‌స్ట్రిక్స్‌ ఏఎండీ రైజన్‌ 5 3400 జీ గేమింగ్ టవర్ డెస్క్‌టాప్ గేమింగ్‌ ప్రియులను అమితంగా ఆకట్టకుంటుంది. 8జీబీ ర్యామ్‌ ద్వారా పని చేసే ఈ ల్యాప్‌టాప్‌ 1టీబీ హెచ్‌డీడీ, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ డ్యూయల్ స్టోరేజ్ సామర్థ్యంతో పని చేస్తుంది. 4 జీబీ న్విడియా జీఫోర్స్‌ గ్రాఫిక్‌ కార్డుతో పని చేసే ఈ డెస్క్‌టాప్‌ గేమింగ్‌ ప్రియులకు అనువుగా ఉంటుంది. ఈ డెస్క్‌టాప్‌ ధర రూ.69990గా ఉంది. 

ఇవి కూడా చదవండి

మిక్‌ సోనిక్‌ గేమింగ్‌ పీసీ

మిక్‌సోనిక్‌  బడ్జెట్ గేమింగ్ పీసీ డెస్క్‌టాప్ అనేది పీసీ గేమింగ్‌కు కొత్త వారికి ప్రవేశ స్థాయి ఎంపికగా ఉంటుంది. కోర్ ఐ5 ప్రాసెసర్‌తో ఆధారంగా పని చేసే డెస్క్టాప్‌ 8 జీబీ ర్యామ్‌ ఆధారంగా పని చేస్తుంది. 500 జీబీ హెచ్‌డీడీ, 120 జీబీ ఎస్‌ఎస్‌డీతో పాటే 2 జీబీ జీటీ 710 గ్రాఫిక్స్ కార్డ్ ఈ డెస్క్‌టాప్‌ ప్రత్యేకత. వైఫై సపోర్ట్‌తో పని చేసే ఈ గేమింగ్‌ పీసీ ధర రూ.రూ.21,800. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..