- Telugu News Photo Gallery Technology photos These are the smartphones under Rs 10,000, check details in telugu
Best Smartphones Under 10K: రూ. 10వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు.. లిస్ట్‌లో 5జీ ఫోన్లు కూడా ఉన్నాయ్..
ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. ప్రజలు ఎక్కువగా ఫీచర్లున్న ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి ఫోన్లు సాధారణంగా మిడ్ రేంజ్ నుంచి హై ఎండ్ వరకూ ఉంటున్నాయి. మంచి ఫీచర్లున్న ఫోన్లు రూ. 10వేల లోపు ధరలో రావాలంటే కాస్త కష్టమైన పనే. అయితే టాప్ బ్రాండ్లు అయిన శామ్సంగ్, పోకో, రియల్ మీ, రెడ్ మీ, లావా వంటి వాటి నుంచి అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 10,000 బెస్ట్ ఫోన్లు ఇవే..
Madhu | Edited By: Janardhan Veluru
Updated on: Jan 08, 2024 | 6:27 PM

పోకో ఎం6 ప్రో 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్ 90హెర్జ్ రిఫ్రెష్ రేట్, 240హెర్జ్ శ్యాంప్లింగ్రేట్ తో కూడిన 6.79 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 3 రక్షణ ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్ఓసీ ద్వారా శక్తిని పొందుతుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. రెండు ఓఎస్ అప్ డేట్లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్లను పొందుతుంది. ఈ ఫోన్లో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50-మెగాపిక్సెల్ ఏఐ సెన్సార్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటాయి. ముందు భాగంలో, 8-మెగాపిక్సెల్ కెమెరా సెల్ఫీలు, వీడియోకాల్స్ చేసుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది.

రెడ్ మీ 13సీ.. ఈస్మార్ట్ ఫోన్ 6.74-అంగుళాల హెచ్డీ+ డిస్‌ప్లే, 600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్, 90హెర్జ్ రిఫ్రెష్ రేట్, మరియు 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో జీ85 చిప్‌సెట్ మాలి-జీ5తో వస్తుంది. 8జీబీ ర్యామ్, 8జీబీ వర్చువల్ ర్యామ్, 256జీబీ మెమరీతో వస్తుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ మాక్రో లెన్స్, మరొక 2ఎంపీ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. వినియోగదారుల సెల్ఫీ, వీడియో కాలింగ్ అవసరాలను తీర్చడానికి స్మార్ట్‌ఫోన్ 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.

రియల్ మీ సీ53.. ఈ స్మార్ట్ ఫోన్ 6.74-అంగుళాల 90హెర్జ్ డిస్ ప్లేతో 90.3% స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. 560 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. స్క్రీన్ 180హెర్జ్ టచ్ శ్యాంప్లింగ్ రేటు ఉంటుంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 108ఎంపీ అల్ట్రా క్లియర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ముందు కెమెరా వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. వీడియో, పోర్ట్రెయిట్ మోడ్, బ్యూటీ మోడ్, హెచ్‌డిఆర్, ఫేస్-రికగ్నిషన్, ఫిల్టర్, బోకె ఎఫెక్ట్ కంట్రోల్ వంటి కొన్ని కెమెరా ఫీచర్లు ఉన్నాయి.

లావా బ్లేజ్ 5జీ.. దీనిలో 90హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.5-అంగుళాల హెచ్ డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంటుంది. అంతేకాకుండా, డిస్ప్లే ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్, వాటర్ డ్రాప్-నాచ్‌తో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 700 ఎస్ఓసీ ద్వారా శక్తిని పొందుతుంది. కొత్త వేరియంట్ 1TB వరకు మెమరీని విస్తరించుకోవడానికి మెమరీ కార్డ్ స్లాట్‌ను కూడా పొందుతుంది. బ్యాటరీ 5,000ఎంఏహెచ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌పై నడుస్తుంది. క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎం13.. ఈ స్మార్ట్‌ఫోన్ 1080 x 2408 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఎల్సీడీ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లేను కలిగి ఉంది. ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో శక్తిని పొందుతుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా వన్ యూఐతో రన్ అవుతుంది. ఫోన్ ముందు భాగంలో 8ఎంపీ కెమెరాను అందిస్తుంది. వెనుకవైపు, 50ఎంపీ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంటుంది.





























