- Telugu News Photo Gallery Technology photos Asus Launching new smartphone Asus ROG Phone 8 and Asus ROG Phone 8 pro check here for features and price details
Asus ROG Phone 8: అసుస్ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ అదుర్స్..
తైవాన్‌కు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం అసుస్ కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. త్వరలోనే భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. అసుస్ రాగ్ ఫోన్ 8 సిరీస్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. తొలుత ఈ స్మార్ట్ ఫోన్‌ను జనవరి 8వ తేదీన ఆవిష్కరించి, ఆ తర్వాత మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...
Updated on: Jan 08, 2024 | 12:10 PM

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం అసుస్.. భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. అసుస్ రోగ్ ఫోన్ 8 సిరీస్ పేరుతో త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. అసుస్ రోగ్ ఫోన్8, అసుస్ రోగ్ ఫోన్ 8 ప్రో పేర్లతో రెండు ఫోన్‌లను లాంచ్ చేయనున్నారు. తొలుత రోగ్ 8ని తీసుకురానున్నారు.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఇవ్వనున్నారు. అసుస్ రోగ్ ఫోన్ 8 ప్రో మోడల్ హెచ్డీఆర్10, 165 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగి ఉంటాయని భావిస్తున్నారు.

ఈ రెండు ఫోన్‌లలోనూ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ నుంచి 24 జీబీ ర్యామ్ విత్ వన్ టిగా బైట్ ఇన్ బిల్ట్ స్టోరేజీ కెపాసిటీతో ఈ ఫోన్‌లు రానున్నాయని సమాచారం.

ఇక కెమెరా విషయానికొస్తే వీటిలో 50 మెగాపిక్సెల్స్, 13 మెగాపిక్సెల్, 32 మెగాపిక్సెల్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించనున్నారని సమాచారం. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు.

ఛార్జింగ్ విషయానికొస్తే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌లోనూ క్విక్ ఛార్జ్ 5.0 అండ్ పీడీ ఛార్జింగ్ సపోర్ట్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్స్‌లో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించనున్నారు.





























