Best Camera Phones: తక్కువ ధరలో బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. ఫొటోగ్రఫీకి సరిగ్గా సరిపోతాయి..
ఇటీవల కాలంలో ఎక్కువ మంది రీల్స్ అని, షార్ట్స్ అని వీడియోలు తీయడానికి మొగ్గుచూపుతున్నారు. అలాగే సెల్ఫీలకూ ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో వారు స్మార్ట్ ఫోన్లలో హై రిజల్యూషన్ కెమెరాలు ఉండేటట్లు చూసుకుంటున్నారు. దీంతో తక్కువ బడ్జెట్లోనే మంచి కెమెరా క్వాలిటీతో కూడిన ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా అలాంటి ఫోన్ల కోసమే చూస్తుంటే.. ఈ కథనం మీ కోసమే. రూ. 20,000లోపు బడ్జెట్లో మంచి కెమెరా క్వాలిటీ కలిగిన స్మార్ట్ ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం.
స్మార్ట్ ఫోన్ అనేది ప్రస్తుత కాలంలో నిత్యావసరంగా మారిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. చేతిలో ఫోన్ లేనిదే అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. కొనుగోలు చేసే స్మార్ట్ ఫోన్లలో కూడా అత్యాధునిక ఫీచర్లు ఉన్నవి కొనుగోలు చేయడానికి అందరూ ఇష్టపడుతున్నారు. అది కూడా అనువైన బడ్జెట్లోనే. ఇటీవల కాలంలో ఎక్కువ మంది రీల్స్ అని, షార్ట్స్ అని వీడియోలు తీయడానికి మొగ్గుచూపుతున్నారు. అలాగే సెల్ఫీలకూ ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో వారు స్మార్ట్ ఫోన్లలో హై రిజల్యూషన్ కెమెరాలు ఉండేటట్లు చూసుకుంటున్నారు. దీంతో తక్కువ బడ్జెట్లోనే మంచి కెమెరా క్వాలిటీతో కూడిన ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా అలాంటి ఫోన్ల కోసమే చూస్తుంటే.. ఈ కథనం మీ కోసమే. రూ. 20,000లోపు బడ్జెట్లో మంచి కెమెరా క్వాలిటీ కలిగిన స్మార్ట్ ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటిపై ఓ లుక్కేయండి..
శామ్సంగ్ గెలాక్సీ ఎం34..
ఈ స్మార్ట్ ఫోన్లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. ఇది 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. పగటి పూట సూర్యకాంతిలోనూ మంచిగా కనింపించేలా 1000నిట్స్ బ్రైట్ నెస్ తో డిస్ ప్లే ఉంటుంది. దీనిలో మీడియా టెక్ 2గిగా హెర్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ ఉంటుంది. 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 13ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 48ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 8ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 5ఎంపీ మాక్రో లెన్స్ ఉంటాయి. ముందు వైపు 13ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. దీని ధర అమెజాన్ వెబ్ సైట్లో రూ. 16,499గా ఉంది.
ఐకూ జెడ్7ఎస్..
ఈ స్మార్ట్ ఫోన్ 6.38అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే తో వస్తుంది. 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1300నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుంది. 360హెర్జ్ శ్యాంప్లింగ్ రేట్ స్మూత్ నావిగేషన్ ఉంటుంది. ఇక కెమెరా విషయానికి సవ్తే 64ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 2ఎంపీ బొకే కెమెరా ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీనిలో అధునాతన కెమెరా ఫీచర్లు ఉంటాయి. అల్ట్రా స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్, మైక్రో మూవీ మోడ్, డ్యూయల్ వ్యూ వీడియో, నైట్ మోడ్, పోర్ట్ రైట్ మోడ్, డబుల్ ఎక్స్ పోజర్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇది స్నాప్ డ్రాగన్ 659 ప్రాసెసర్ తో వస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమరీతో ఈ ఫోన్ వస్తుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీని ధర అమెజాన్ వెబ్ సైట్లో రూ. 17,999గా ఉంది.
రెడ్ మీ నోట్ 12 ప్రో..
ఈ స్మార్ట్ ఫోన్లో వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్ ఉంటుంది. 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపీ మాక్రో సెన్సార్ ఉంటుంది. ముందువైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. బ్యాటరీ 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. దీని ధర రూ. 18,690 గా అమెజాన్లో ఉంది.
మోటోరోలా జీ54..
ఈ ఫోన్లో క్వాడ్ పిక్సల్ టెక్నాలజీ తో కూడిన 50ఎంపీ కెమెరాతో వస్తుంది. 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ముందు వైపు 16ఎంపీ కెమెరా ఉంటుంది. దీనిలో అనేకరకాల ఫొటోగ్రఫీ ఫీచర్లు ఉంటాయి. అల్ట్రా రెస్, డ్యూయల్ క్యాప్చర్, స్పాట్ కలర్, నైట్ విజన్, మాక్రో విజన్, పోర్ట్ రైట్, లైవ్ ఫిల్టర్, పనోరమా, ఏఆర్ స్టిక్కర్స్, ప్రో మోడ్ , స్మార్ట్ కంపోజిషన్, ఆటో స్మైల్ క్యాప్చర్, గూగుల్ లెన్స్ ఇంటిగ్రేషన్, యాక్టివ్ ఫొటోస్, టైమర్ వంటివి ఉంటాయి. దీనిలో 6.55 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ పీ ఓఎల్ఈడీ డిస్ ప్లే 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 7020 ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ ఉంటుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 6000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీని ధర అమెజాన్ లో రూ. 18,640 ఉంటుంది.
ఒప్పో ఏ79..
ఈ స్మార్ట్ ఫోన్లో 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. దీనిలో మీడియా టెక్ 6020 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. దీని ధర అమెజాన్ వెబ్ సైట్లో రూ. 19,999గా ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..