Airtel Prepaid Plans: అందుబాటులో ధరల్లో ఉండే ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్స్ ఇవే.. డేటాతో పాటు ఎన్నో అదనపు ప్రయోజనాలు
ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్స్ సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో వారు తక్కువ ధరల్లో వచ్చే నెలవారీ ప్లాన్స్‌ను ఆదరిస్తున్నారు. ఇలాంటి వారిని ఆకట్టుకునేందుకు ప్రముఖ టెలికాం సంస్థ అయిన ఎయిర్‌టెల్ తక్కువ ధరల్లో నెలవారీ ప్లాన్స్‌ను అందిస్తుంది.
భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా టెలికాం రంగంలో జియో ప్రభావంతో అన్ని కంపెనీ తమ వినియోగదారులకు తక్కువ ధరల్లో డేటా ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. అయితే ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్స్ సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో వారు తక్కువ ధరల్లో వచ్చే నెలవారీ ప్లాన్స్‌ను ఆదరిస్తున్నారు. ఇలాంటి వారిని ఆకట్టుకునేందుకు ప్రముఖ టెలికాం సంస్థ అయిన ఎయిర్‌టెల్ తక్కువ ధరల్లో నెలవారీ ప్లాన్స్‌ను అందిస్తుంది. మీరు బడ్జెట్ కింద కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌ల కోసం ప్లాన్ చేస్తుంటే ఎయిర్‌టెల్‌లో ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు. ఎయిర్‌టెల్ అందించే రోజువారీ ప్లాన్‌లు అపరిమిత కాల్‌లతో పాటు 1జీబీ రోజువారీ ఇంటర్నెట్‌ను అందిస్తాయి. ఎయిర్‌టెల్ అందించే ఆ ప్లాన్ వివరాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
రూ. 209 ప్లాన్ :
ఈ ప్లాన్ కింద వినియోగదారులు 21 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు అపరిమిత లోకల్, ఎస్‌టీడీ, అలాగే రోమింగ్ లోకల్, ఎస్‌టీడీ కాల్‌లను పొందుతారు. అదనంగా వారు రోజుకు 100 ఎస్ఎంఎస్, వింక్ మ్యూజిక్, హలో ట్యూన్‌లకు ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందుతారు.
రూ. 239 ప్లాన్:
ఈ ప్లాన్ కింద వినియోగదారులు 24 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటాను పొందుతారు. అలాగే అపరిమిత లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్‌ను ఆశ్వాదించవచ్చు. అదనంగా వారు ప్లాన్‌లో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పొందుతారు. అలాగే అపరిమిత 5జీ డేటా, వింక్ మ్యూజిక్, హలో ట్యూన్‌లకు ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందుతారు.
రూ. 265 ప్లాన్:
ఈ ప్లాన్ కింద వినియోగదారులు 28 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటాను పొందుతారు. అలాగే అపరిమిత లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్‌ను పొందుతారు. అదనంగా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమిత 5 జీ డేటా, వింక్ మ్యూజిక్, హలో ట్యూన్‌లకు ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు.
రూ.300 లోపు ఉన్న ఇతర ప్లాన్‌లు
మీ బడ్జెట్ నెలకు రూ. 300 కంటే తక్కువ ఉంటే మీకు అందుబాటులో రెండు ప్లాన్‌లు ఉన్నాయి. వినియోగదారులు రూ.296 లేదా రూ.299 ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. రూ.296 ప్లాన్ 25 జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌తో 30 రోజుల వ్యాలిడిటీను అందిస్తుంది. రూ.299 ప్లాన్ రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌తో 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..