Whatsapp Tick: డిలీట్ చేసిన వాట్సాప్ మెసేజ్‌లను చదవండిలా… ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు
గతంలో వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్ పంపితే డిలీట్ చేసే సదుపాయం ఉండేది కాదు. కానీ 2017లో వాట్సాప్ ఆ సదుపాయాన్ని కూడా వినియోగదారులకు కల్పించింది. డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అని మెసేజ్ డిలీట్ చేసే సదుపాయం కల్పించింది.
ప్రస్తుతం యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్‌లోని వాట్సాప్‌ను ఎక్కువగా వాడుతున్నారు. అయితే వివిధ అప్‌డేట్స్‌తో వాట్సాప్ కూడా యువతను ఎక్కువ ఆకట్టుకుంటుంది. గతంలో వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్ పంపితే డిలీట్ చేసే సదుపాయం ఉండేది కాదు. కానీ 2017లో వాట్సాప్ ఆ సదుపాయాన్ని కూడా వినియోగదారులకు కల్పించింది. డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అని మెసేజ్ డిలీట్ చేసే సదుపాయం కల్పించింది. అయితే మీరు పంపిన మెసేజ్ డిలీటెడ్ అని మీరు మెసెజ్ పంపిన వారికి కనిపిస్తుంది. ఇలా మనకు ఎవరైనా చేస్తే ఆ మెసేజ్ ఏంటి? ఏం పంపారు? అని ఉత్సుకత ఉంటుంది. ఆ డిలీట్ చేసిన మెసేజ్‌ను ఇప్పుడు కొన్ని చిట్కాల ద్వారా చదివే అవకాశం ఉంటుంది. డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఫీచర్ వ్యక్తులు తమ లోపాలను దాచిపెట్టడానికి, అలాగే తప్పుగా పంపిన మెసేజ్‌కను సరిదిద్ది మళ్లీ పంపడానికి ఉద్దేశించి ప్రవేశపెట్టారు. అయితే డిలీట్ మెసేజ్‌లను కూడా ఎలా తెలుసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.
వాట్సాప్ బ్యాకప్
డిలీట్ చేసిన వాట్సాప్ సందేశాలను పునరుద్ధరించడానికి మీ డేటాను క్రమం తప్పకుండా బ్యాకప్ చేయడం మంచి మార్గం. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి తర్వాత అందులోని సెట్టింగ్స్ ఓపెన్ చేసి, తర్వాత చాట్స్‌ను ఎంచుకుని, చాట్ బ్యాకప్‌కి వెళ్లి, తొలగించిన సందేశాలను కలిగి ఉన్న మునుపటి బ్యాకప్ కోసం ప్రయత్నించాలి. అయితే బ్యాకప్‌ని అమలు చేయడానికి యాప్‌ను తొలగించి, మళ్లీ లాగిన్ చేయడం అవసరం కాబట్టి ఈ పద్ధతికి కొంతమేర ఇబ్బందిగా ఉంటుంది.
ఆండ్రాయిడ్ 11 వినియోగదారులకు ఇలా
ఆండ్రాయిడ్ 11 వినియోగదారులకు మరొక సురక్షితమైన, అవాంతరాలు లేని ఎంపిక అందుబాటులో ఉంది. మీరు నోటిఫికేషన్ చరిత్రను తనిఖీ చేయడం ద్వారా తొలగించిన వాట్సాప్ సందేశాలను చదవవచ్చు. అదెలాగో? ఓ సారి చూద్దాం.
- మీ ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి
- అక్కడ్ యాప్‌లు, నోటిఫికేషన్ ఆప్షన్‌కను ఎంచుకోవాలి.
- అక్కడ ‘నోటిఫికేషన్‌లు’ ఎంచుకోండి.
- ‘నోటిఫికేషన్ హిస్టరీ’పై నొక్కాలి.
- దాన్ని ఆన్ చేయడానికి ‘నోటిఫికేషన్ చరిత్రను ఉపయోగించాలి.’ ఇలా చేయడానికి పక్కన ఉన్న బటన్‌ను టోగుల్ చేయండి.
- నోటిఫికేషన్ హిస్టరీని ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు వాట్సాప్ మెసేజ్‌ల నోటిఫికేషన్‌లను డిలీట్ చేసినప్పటికీ చూడగలరు.
థర్డ్ పార్టీ యాప్స్
ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న థర్డ్-పార్టీ డేటా రికవరీ యాప్‌లను ఉపయోగించి తొలగించిన వాట్సాప్ మెసేజ్‌లను చదవడం సాధ్యమే అయినప్పటికీ, ఈ సాధనాలను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ప్లేస్టోర్ నుంచి గెట్ డిలీటెడ్ మెసేజెస్ యాప్‌ని ఉపయోగించి తొలగించిన వాట్సాప్ మెసేజ్‌లను చదవవచ్చు. యాప్‌కి అవసరమైన అనుమతులను మంజూరు చేయాలి. వాట్సాప్‌లో మెసేజ్ డిలీట్ చేసి చదవడానికి యాప్‌ని తెరిస్తే చాలు డిలీట్ చేసిన మెసేజ్ మీరు చదవవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి