AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Prepaid Plans: వొడాఫోన్ ఐడియా నుంచి అదిరిపోయే ప్లాన్లు.. రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌తో పాటు ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్..

రూ.368, రూ.369 ప్లాన్స్ మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. అయితే, రూ.368 ప్లాన్ సన్ నెక్ట్స్ యాప్ కి యాక్సెస్ కలిగి ఉంటే, రూ.369 ప్లాన్ ద్వారా సోనిలివ్ యాప్ కి సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ ప్లాన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

New Prepaid Plans: వొడాఫోన్ ఐడియా నుంచి అదిరిపోయే ప్లాన్లు.. రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌తో పాటు ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్..
Vodafone Idea Plans
Madhu
|

Updated on: Apr 20, 2023 | 5:00 PM

Share

దేశీయ టెలికాం దిగ్గజాలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే 5జీ సేవల ద్వారా రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ సంస్థలు ముందుజలో ఉండగా.. వీటి తర్వాత వోడాఫోన్ ఐడియా ఉంది. ఇది కూడా తన పరిధిని పెంచుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న రూ.129, రూ. 298 ప్లాన్ల స్థానంలో రూ. 368, రూ. 369 లతో కొత్త ప్రయోజనాలను తీసుకొచ్చింది. వీటిల్డో రోజువారీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు పలు ఓటీటీ ప్లాట్ ఫారమ్ లకు సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. రూ.368, రూ.369 ప్లాన్స్ మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. అయితే, రూ.368 ప్లాన్ సన్ నెక్ట్స్ యాప్ కి యాక్సెస్ కలిగి ఉంటే, రూ.369 ప్లాన్ ద్వారా సోనిలివ్ యాప్ కి సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ ప్లాన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వొడాఫోన్ ఐడియా రూ.368..

వొడాఫోన్ ఐడియా లాంచ్ చేసిన రూ. 368 ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.. రూ.368 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్ కి ప్రతిరోజూ 2జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అంటే యూజర్ కి మొత్తం 60జీబీ డేటా లభిస్తుంది. అంతేకాదు, యూజర్ కి ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ఇంకా ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి. ఈ కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ కాకుండా కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ప్లాన్ ద్వారా లభిస్తాయి. అవేంటంటే, యూజర్ కి సన్ నెక్ట్స్ యాప్ కి యాక్సెస్ లభిస్తుంది. ఇది 30 రోజుల పాటు వర్తిస్తుంది. వీకెండ్ రోలోవర్ ఫెసిలిటీ, వీఐ మూవీస్ సబ్‌స్క్రిప్షన్, ప్రతినెల 2జిబి డేటా బ్యాకప్ లభిస్తాయి. అయితే ఈ బెనిఫిట్స్ పొందేందుకు వీఐ యాప్ యూజర్లు 121249 కి డయల్ చేయాల్సి ఉంటుంది.

వొడాఫోన్ ఐడియా రూ.369..

వొడాఫోన్ ఐడియా రూ.369 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు ఇలా ఉన్నాయి. రూ.369 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా యూజర్ కి ప్రతిరోజూ 2జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అంటే కస్టమర్ కి మొత్తం 60జీబీ డేటా లభిస్తుంది. ఇంకా అపరిమిత కాలింగ్ సౌకర్యం యూజర్ కి లభిస్తుంది. ఇంకా ప్రతిరోజూ యూజర్ కి 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అదనపు ప్రయోజనాల విషాయానికి వస్తే యూజర్ కి బింజ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోలోవర్, సోనిలివ్ యాప్ యాక్సెస్, వీఐ మూవీస్, టీవీ యాప్స్, ప్రతినెల 2జీబీ వరకు డేటా బ్యాకప్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఈ అదనపు ప్రయోజనాలు పొందేందుకు యూజర్ 121249 కి డయల్ చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
నువ్వూ, నీ జిడ్డు ఆట.. విమర్శలకు ఇచ్చిపడేసిన తెలుగబ్బాయ్..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సునే చోరీచేసి పరారైన దొంగ బాబు..!
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
స్విచ్‌బోర్డ్‌పై ఉండే రెడ్ లైట్‌తో కరెంట్ బిల్ చాలా వస్తుందా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నల్లటి కేశాల నుండి కాలేయ ఆరోగ్యం వరకు..భృంగరాజ్‌తో ఇన్న లాభాలా?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
నువ్వు నువ్వు పాట వెనుక ఇంత అర్థం ఉందా.. ?
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
తిరుమలలో దర్శనం టికెట్ల జారీ బంద్.. టీటీడీ అలర్ట్..
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఆగస్టు నెలలో 9 రోజులు బ్యాంకులు బంద్‌..!
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?